ఐపీఎల్ లో ఈ రోజు ఆర్సీబీ, ఆర్ఆర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో బెంగళూరు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 205 పరుగులు చేసి ఆర్ఆర్ కు 206 టార్గెట్ ఇచ్చింది. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులే చేసింది. పరుగుల ఛేదనలో ఆర్ఆర్ తొమ్మిది వికెట్లను కోల్పోయింది. యశస్వీ జైస్వాల్ (49), ధ్రువ్ జురెల్ (47) పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బెంగళూరు జట్టులో హేజిల్ వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 19వ ఓవర్లో కేవలం ఒక పరుగే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. చివరి ఓవర్లో లక్ష్యం 17 పరుగులు కాగా, యశ్ దయల్ వికెట్ తీసి కేవలం 5 పరుగులే ఇచ్చాడు. ఆర్సీబీలో హేజిల్ వుడ్ 4, కృనాల్ పాండ్య 2, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్ ఒక్కో వికెట్ తీశారు.
చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.
ఎవరెన్ని కొట్టారంటే?
ఫిల్ సాల్ట్ 23 బంతుల్లో 26 పరుగులు, విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 70 పరుగులు, పడిక్కల్ 27 బంతుల్లో 50 పరుగులు, కెప్టెన్ రజత్ పాటిదార్ 3 బంతుల్లో 1 పరుగు చేశాడు. అలాగే మ్యాచ్ ఆఖరి వరకు ఆడిన డేవిడ్ 15 బంతుల్లో 23 పరుగులు, జితేశ్ శర్మ 10 బంతుల్లో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
కోహ్లీ పరుగుల వరద
32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా దూకుడుగానే ఆడుతూ రన్స్ రాబట్టాడు. అప్పటికే రెండు సిక్సులు కొట్టి ఫ్యాన్స్‌కు మంచి ఊపు తెప్పించాడు. కానీ మరో షార్ట్ ఆడే క్రమంలో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 42 బంతుల్లో 70 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రెండు సిక్సులు కొట్టిన కోహ్లీ.. మరో సిక్స్ కొట్టుంటే అరుదైన రికార్డు క్రియేట్ చేసి ఉండేవాడు.
today-latest-news-in-telugu | IPL 2025 | rcb-vs-rr | match