/rtv/media/media_files/2025/03/09/qUM1Yr6Z5mPALhp5kPiq.jpg)
team india (4) Photograph: (team india (4))
భారత్ vs న్యూజిలాండ్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. కివీస్ నిర్ధేశించిన 251 పరుగులను భారత్ ఒక ఓవర్ ముందే ఛేదించింది. చివరి బాల్ ఫోర్‌తో జడేజా భారత్‌కు విజయాన్ని అందించాడు. అయితే ఈ మ్యాచ్ మాత్రం అత్యంత ఉత్కంఠగా సాగింది. ఏ సమయంలో ఏం జరుగుతుందా? అనే ఆసక్తి అదరిలోనూ కలిగింది.
మొదట ఓపెనర్లుగా దిగిన రోహిత్, గిల్ కొంత సమయం వరకు నిలకడగా ఆడుతూ.. పరుగులు రాబట్టారు. భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో అదరగొట్టేశాడు. ఇక ఇద్దరు ఓపెనర్లు మంచి ఫామ్ కనబరుస్తూ రన్స్ తెప్పించారు. అలాంటి సమయంలో శుభమన్ గిల్ ఔటయ్యాడు. 50 బంతుల్లో 31 పరుగులు సాధించాడు. దీంతో క్రీజ్‌లోకి విరాట్ వచ్చాడు. అప్పటికే ఫ్యాన్స్‌లో ఫుల్ హోప్స్ వచ్చేశాయి. పర్వాలేదులే మనోళ్లు కప్పు కొట్టేస్తారు అని అంతా భావించారు. దాదాపు 100 పరుగుల వరకు బాగానే ఉంది.
ఇక విరాట్ కోహ్లీ ఇలా క్రీజ్‌లోకి వచ్చాడో లేదో అలా రెండు బంతుల్లో ఔటైపోయాడు. కేవలం 1 పరుగుకే పరిమితం అయ్యాడు. దీంతో ఇండియన్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. రోహిత్, కోహ్లీ విన్ చేసేస్తారు అనుకుంటే ఇలా జరిగిందేంటి అని అంతా ఆశ్చర్యపోయారు. కానీ క్రీజ్‌లో రోహిత్ శర్మ ఉండటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. విరాట్ తర్వాత క్రీజ్‌లోకి శ్రేయస్ అయ్యార్ వచ్చాడు.
ఇద్దరూ ఆడుతుండగా రోహిత్ శర్మ ఔటయ్యాడు. 83 బంతుల్లో 76 పరుగులు సాధించాడు. దీంతో ఇంకేముంది భారత్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. మరో రెండు మూడు వికెట్లు పడితే భారత్ పని అయిపోతుందని అంతా అనుకున్నారు. రోహిత్ వికెట్ తర్వాత క్రీజ్‌లో అక్షర్ పటేల్ వచ్చాడు. అక్కడ నుంచి శ్రేయస్, అక్షర్ పటేల్ ఇద్దరూ కలిసి కాస్త నిలకడగా ఆడారు. దీంతో ఫ్యాన్స్ హమ్మయ్య పర్వాలేదులే వీరిద్దరూ మ్యాచ్‌ను గెలిపించేస్తారు అని హ్యాపీగా ఫీలయ్యాడు.
శ్రేయస్ ఒకవైపు మెల్లి మెల్లిగా ఆడుతూ.. ఫోర్లు, సిక్సర్లు రాబట్టాడు. మరోవైపు అక్షర్ కూడా ఫోర్లు రాబడుతూ వావ్ అనిపించాడు. ఇలా ఇద్దరూ నిలకడగా ఆడుతున్న సమయంలో శ్రేయస్ 48 పరుగుల వద్ద ఔటయ్యాడు. అక్కడితో అందరి ఆశలు కేఎల్ రాహుల్ మీదే పెట్టుకున్నారు. వారి ఆశలకు తగ్గట్టుగానే శ్రేయస్ ఔట్ తర్వాత కేఎల్ రాహుల్ క్రీజ్‌లోకి వచ్చాడు.
క్రీజ్‌లో రాహుల్, అక్షర్ ఆడుతూ విన్ చేసేస్తారని అంతా భావించారు. అక్కడే భారత్‌కు గట్టి షాక్ తగిలింది. అక్షర్ పటేల్ ఔటయ్యాడు. ఇంకేముంది అందరి ముఖాల్లో గందరగోళం మొదలైంది. విన్ అవుతుందా లేదా.. అనే ఉత్కంఠ స్టార్ట్ అయింది. అప్పటికే 5 వికెట్లు పడిపోయాయి. క్రీజ్‌లో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య ఉన్నారు. సర్లే వీళ్లిద్దరైనా విన్ చేస్తారా? అనుకుంటే అదీ లేదు. క్యాచ్ ఇచ్చి హార్దిక్ ఔటయ్యాడు. అంతా అయోమయంలో పడ్డారు. ఏంటిది ఇలా జరిగింది అంటూ ఆందోళన చెందారు. చివరిగా అందరూ ఊపిరిపీల్చుకునే విధంగా రాహుల్, జడేజా కలిసి భారత్‌ను గెలిపించారు.