Latest News In Telugu Paloma Villa: నీట మునిగిన కోట్లు రూపాయల విల్లాలు.. లబోదిబోమంటున్న బాధితులు! రంగారెడ్డి జిల్లాలోని మోకిల్లాలో 212 పలోమా విల్లాలు నీటిలో మునిగాయి. లగ్జరీ కార్లు, బైకులు వరద నీటిలో తేలియాడుతున్నాయి. ఒక్కో విల్లా ఖరీదు రూ.3 కోట్లకు పైగానే ఉండగా.. కోట్ల రూపాయలు పెట్టి కొంటే తమను వరదల్లో ముంచేశారని బాధితులు లబోదిబోమంటున్నారు. By srinivas 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad Crime: దూసుకొచ్చిన మృత్యువు...యువతి మృతి! వనస్థలిపురంలో ఘోర ప్రమాదం జరిగింది. వనస్థలిపురం ఎన్జీఓ కాలనీలోని వివేకానంద పార్క్ ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో సోని అనే యువతి మృతి చెందింది.ర్యాష్ డ్రైవింగ్ తో యువతి ప్రాణాలు బలిగొన్న వ్యక్తిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. By Bhavana 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rain effect: రాష్ట్రంలో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు! రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించడంతో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపడుతోంది. హైదరాబాద్‌లోని అన్ని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. By srinivas 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad : 25 పబ్‌లలో తనిఖీలు.. ఆరుగురు అరెస్ట్..! హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని 25 పబ్‌లలో అధికారులు అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేశారు. పబ్బుల్లో 107 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు నిర్వహించి.. డ్రగ్స్ తీసుకున్న ఆరుగురుని అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతోనే రాత్రి 11 గంటల నుండి 1 వరకు తనిఖీలు నిర్వహించారు. By Jyoshna Sappogula 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hydra : హైడ్రా అటాక్.. బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి కట్టడాల కూల్చివేత..! హైదరాబాద్‌లో హైడ్రా దూకుడు కొనసాగుతోంది. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని గగన్‌పహాడ్‌లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. అప్పా చెరువు FTLలో నిర్మించిన బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి కట్టడాలను కూల్చివేస్తున్నారు. By Jyoshna Sappogula 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Hyderabad IT Layoffs : హైదరాబాద్ లో ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఐటీ కంపెనీ.. ఒకే సారి 1500 మంది ఔట్! హైదరబాద్ లోని బ్రేన్అనే ఐటీ కంపెనీ ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దాదాపు 1,500 మంది ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించింది. వివిధ రకాల బిజినెస్ కారణాలు చెబుతూ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వారికి మెయిల్స్ ఇచ్చింది. కనీసం వారికి 3 నెలల నుంచి జీతాలు కూడా చెల్లించట్లేదు. By Bhavana 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: ప్రేమోన్మది దాడిలో మరో యువతి బలి! హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో దారుణ ఘటన జరిగింది. ప్రేమోన్మాది దాడిలో దీపన తమాంగ్ (25) అనే యువతి దారుణ హత్యకు గురైంది. మరో ముగ్గురు యువతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ తరువాత నిందితుడు రాకేశ్ కూడా ఆత్మహత్యాయత్నానికిప్రయత్నించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Bhavana 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: హైదరాబాద్ లో దారుణం.. పెట్రోల్ కోసం కాల్చేశాడు..! హైదరాబాద్‌లో దారుణం జరిగింది. జీడిమెట్లలో పెట్రోల్ కోసం ఓ బైకర్పై కాల్పులు జరిపారు దుండగులు. తమ బైక్‌లో పెట్రోల్ అయిపోవడంతో అటుగా వస్తున్న మరో బైక్‌లో పెట్రోల్ చోరీకి యత్నించారు. బైక్ ఓనర్ అడ్డుకోవడంతో మల్లంపేట్‌కు చెందిన నరేష్ అతనిపై కాల్పుడు జరిపాడు. By Archana 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: రాంనగర్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్.. స్థానికుల నుంచి ఫిర్యాదులు హైదరాబాద్‌లోని ముషీరాబాద్ నియోజకవర్గంలో సాయంత్రం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆకస్మికంగా పర్యటించారు. రాంనగర్ చౌరస్తాలోని మణెమ్మ గల్లిలోని నాలాపై అక్రమ నిర్మాణాలు చేపట్టారని స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులతో కలిసి రంగనాథ్ పరిశీలించారు. By B Aravind 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn