/rtv/media/media_files/2026/04/11/mangli-1-2026-04-11-10-20-21.jpg)
Mangli: ప్రముఖ సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతికి బిగ్ షాక్ తగిలింది. వ్యాపార పెట్టుబడుల పేరుతో సుమారు రూ.10 కోట్ల మేర మోసం చేశారంటూ పంజాగుట్ట పోలీసులు మంగ్లీ ఆమె సోదరుడు శివతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. మైక్రో ఫైనాన్స్, వ్యాపార పెట్టుబడుల పేరుతో సుమారు 100 మంది అమాయక బాధితుల నుంచి రూ. 10 కోట్లకు పైగా వసూలు చేసి మోసం చేశారనేది ప్రధాన ఆరోపణ. వ్యాపారంలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామని నమ్మించి ఈ సొమ్ము సేకరించినట్లు తెలుస్తోంది. అయితే, ఏళ్లు గడుస్తున్నా లాభాలు ఇవ్వకపోగా, కనీసం అసలు డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదని బాధితులు వాపోతున్నారు.
Also Read: గూగుల్ పే పాకెట్ మనీ ఐకాన్ నొక్కితే డబ్బులు పోతాయా? నిజమెంత?
మంగ్లీ టీమ్ బెదిరింపులు
బాధితుల తరపున ఈ నిధులను వెనక్కి ఇవ్వాలని నిలదీసిన లాయర్ సుబ్బారావును మంగ్లీ టీమ్ బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మంగ్లీ, ఆమె సోదరుడు శివ, మరికొందరు తనకు ఫోన్ చేసి తీవ్రంగా హెచ్చరించారని, తనను రోడ్డు ప్రమాదంలో చంపేస్తామని భయపెట్టారని సుబ్బారావు పోలీసులకు తెలిపారు. తనకు వీరి వల్ల ప్రాణహాని ఉందని ఆయన ఫిర్యాదులో వివరించారు. న్యాయవాది సుబ్బారావు మేరకు పంజాగుట్ట పోలీసులు మంగ్లీ (A5), ఆమె సోదరుడు శివతో పాటు మరో ముగ్గురిపై బిఎన్ఎస్ (BNS) సెక్షన్లు 351 (2), 352 కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో దర్శకుడు వేణు ఊడుగుల పేరు కూడా వినిపిస్తోంది. ఈ మోసం వెనుక ఎవరి పాత్ర ఎంతవరకు ఉందనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:'కాంతారా 3'కి బ్రేక్ పడిందా..? రిషబ్ శెట్టి ప్రాజెక్ట్‌పై కొత్త ట్విస్ట్!
ఇదిలా ఉండగా ఇటీవల చేవెళ్లలోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో మంగ్లీ తన సన్నిహితులకు ఇచ్చిన పుట్టినరోజు వేడుకలు పెను వివాదానికి దారితీశాయి. ఈ పార్టీపై సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించగా, అక్కడ విదేశీ మద్యం, గంజాయి వంటి నిషేధిత పదార్థాలు లభ్యమయ్యాయి. ఈ పార్టీకి హాజరైన వారిలో పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలడం సంచలనం సృష్టించింది.
గత కొంతకాలంగా మంగ్లీ పేరు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తోంది. అటు ఆర్థిక మోసం ఆరోపణలు, ఇటు డ్రగ్స్ పార్టీ వ్యవహారాలు ఆమె కెరీర్‌పై ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి. ఒకవైపు సింగర్‌గా మంచి ఫామ్‌లో ఉన్న తరుణంలో ఇలాంటి క్రిమినల్ కేసులు నమోదు కావడం ఆమె అభిమానులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఈ రెండు కేసుల్లో పోలీసులు తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
Follow Us