BIG BREAKING : ఉప్పల్ మెట్రో స్టేషన్‌లో బాంబు..  !

హైదరాబాద్ లోని ఉప్పల్ మెట్రో స్టేషన్‌లో శుక్రవారం ఉదయం బాంబు కలకలం రేగింది. మెట్రో స్టేషన్‌లో బాంబు ఉందంటూ ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరించడంతో ప్రయాణికులు, మెట్రో సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

New Update
uppal

హైదరాబాద్ లోని ఉప్పల్ మెట్రో స్టేషన్‌లో శుక్రవారం ఉదయం బాంబు కలకలం రేగింది. మెట్రో స్టేషన్‌లో బాంబు ఉందంటూ ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరించడంతో ప్రయాణికులు, మెట్రో సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మెట్రో సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

స్టేషన్ అంతటా క్షుణ్ణంగా

రంగంలోకి దిగిన పోలీసులు బాంబ్ స్క్వాడ్ ,  డాగ్ స్క్వాడ్‌తో కలిసి స్టేషన్ అంతటా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. మెట్రో స్టేషన్ మూలమూలలా గాలించిన భద్రతా బలగాలు, అనుమానాస్పద వస్తువుల కోసం తీవ్రంగా వెతికాయి. సుమారు గంటకు పైగా కొనసాగిన ఈ తనిఖీల్లో ఎక్కడా బాంబు లేదా పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో అది ఫేక్ కాల్ అని తేలడంతో పోలీసులు, ప్రయాణికులు, మెట్రో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

తనిఖీల అనంతరం స్టేషన్‌లో ఎలాంటి ప్రమాదం లేదని పోలీసులు అధికారికంగా ప్రకటించారు. నిందితుడు ఎక్కడి నుండి ఫోన్ చేశాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తప్పుడు సమాచారంతో ప్రజలను భయాందోళనకు గురిచేసిన వ్యక్తిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ టీమ్ సహాయం తీసుకుంటున్నారు. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని, ఏదైనా అనుమానాస్పద వస్తువు కనిపిస్తే వెంటనే '100'కు డయల్ చేయాలని పోలీసులు కోరుతున్నారు.

Advertisment
తాజా కథనాలు