Kerala:ఒక్క సిరంజీ . 10 మందికి ఎయిడ్స్!
కేరళలోని మలప్పురం లో హెచ్ఐవీ సోకిన వ్యక్తి వాడిని సిరంజీని మిగితా 9 మంది ఉపయోగించడంతో వారందరికీ ఎయిడ్స్ వ్యాప్తి చెందిందని అధికారులు తేల్చారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కేరళలోని మలప్పురం లో హెచ్ఐవీ సోకిన వ్యక్తి వాడిని సిరంజీని మిగితా 9 మంది ఉపయోగించడంతో వారందరికీ ఎయిడ్స్ వ్యాప్తి చెందిందని అధికారులు తేల్చారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
హెచ్ఐవీ బాధితులకు శాస్త్రవేత్తలు ఓ గుడ్‌న్యూస్ చెప్పారు. హెచ్ఐవీని నివారించేందుకు తమ క్లినికల్ ట్రయల్స్‌లో ఓ ఇంజెక్షన్ విజయవంతమైందని చెప్పారు. ఈ ఇంజెక్షన్ సంవత్సరంలో ఒకసారి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ హెచ్ఐవీ పరీక్ష చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జీ 7 దేశాల నాయకుల్లో బహిరంగంగా హెచ్ఐవీ పరీక్ష చేయించుకున్న తొలి ప్రధానిగా నిలిచారు. ఈ విషయాన్ని యూకే ప్రధాన మంత్రి కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.
ప్రజల్లో అవగాహన పెరగడం, హైచ్ఐవీ రోగులను గుర్తించి చికిత్స అందించడం వల్ల ఎయిడ్స్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. భారత్‌లో 2010 నుంచి హెచ్ఐవీ వ్యాప్తి రేటు 44 శాతం తగ్గినట్లు ఇటీవల ఐక్యరాజ్యసమితిలో జరిగిన సమావేశంలో కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మంది హెచ్ఐవీతో బాధపడుతున్నట్లు ఐక్యరాజ్యసమితి తాజా సర్వే ఆధారంగా వెల్లడించింది. సెక్స్ వర్కర్లు, వివాహేతర సంబంధాల కారణంగా యువతలో ఈ వ్యాధి అధికంగా ఉన్నట్లు గుర్తించింది. 2023లో 6.3 లక్షల మంది మరణించినట్లు తెలిపింది.
హెచ్ఐవి అనేది ఎయిడ్స్‌కు కారణమయ్యే ఇన్ఫెక్షన్.ఈ వ్యాధికి సంబంధించి రకరకాల అపోహలు ఉంటాయి. HIV-పాజిటివ్ వ్యక్తులందరికి AIDSని అభివృద్ధి చెందుతుందని అనుకుంటారు. కానీ హెచ్ఐవి ఇన్ఫెక్షన్కు ముందస్తుగా చికిత్స చేయడం ద్వారా ఎయిడ్స్‌ను నివారించవచ్చుని నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న హెచ్ఐవీని కట్టడి చేసేందుకు అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజం గిలియడ్ సైన్సెస్ అనే సంస్థ.. లెనాకాపవిర్ అనే ఇంజక్షన్‌ను అభివృద్ధి చేసింది. క్లినికల్ ట్రయల్స్‌లో 100 శాతం సక్సెస్ అయిన ఈ ఇంజెక్షన్ త్వరలో మార్కెట్లోకి రానుంది.
త్రిపురలో 47 మంది విద్యార్థులు హెచ్ఐవీతో మృతి చెందారు. ఇప్పటి వరకు 828 మంది విద్యార్థులకు హెచ్ఐవీ పాజిటివ్ గా గుర్తించినట్లు త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.