Floods: భయంకరమైన వరదలు.. నలుగురు మృతి
జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భయంకరమైన వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. డోడా జిల్లాలో క్లౌడ్‌బరస్ట్ వల్ల నలుగురు మృతి చెందడం కలకలం రేపింది. కఠువా, కిశ్త్‌వాడ్‌లో కూడా వరదలు సంభవించాయి.
జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భయంకరమైన వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. డోడా జిల్లాలో క్లౌడ్‌బరస్ట్ వల్ల నలుగురు మృతి చెందడం కలకలం రేపింది. కఠువా, కిశ్త్‌వాడ్‌లో కూడా వరదలు సంభవించాయి.
పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తంఖ్వా రాష్ట్రంలో ఆకస్మికంగా కురిసిన కుండపోత వర్షాలకు ఇప్పటి వరకు 365 మంది మృతి చెందారు. కేవలం బునేర్ జిల్లాలో దాదాపుగా 225 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పలుచోట్ల కొండ చరియలు విరిగిపడి వంతెనలు, రోడ్లు కూలిపోయాయి.
ముంబయిని వానలు ముంచేత్తాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలు, వరదలతో ముంబై జలమయమైంది. ఈ వర్షాల మూలంగా మోనో మెట్రో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. మోనో మెట్రో రైలు మొరాయించింది. కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో మోనో మెట్రో రైలు ఆగిపోయింది.
తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ముఖ్యంగా కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.ఆదిలాబాద్, కుమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
దేశవ్యాప్తంగా వర్షాలు కుంభవృష్టిగా కురుస్తున్నాయి. ఇప్పటికే బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం కొనసాగుతుండగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న 12 గంటల్లో అది వాయుగుండగా మారే అవకాశం ఉందని భారతవాతావరణ శాఖ హెచ్చరించింది.
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వల్ల విశాఖపట్నం, అనకాపల్లి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
హిమాచల్ ప్రదేశ్‌లో భారీగా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో దాదాపుగా 355 రోడ్లు ఇప్పటి వరకు మూతపడ్డాయి. అయితే గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా దాదాపుగా 261 మంది మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు.