Heavy Rains: భారీ వర్షాలు.. 300 మంది మృతి
పాకిస్థాన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు పొటెత్తడంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. జూన్ 26 నుంచి ఇప్పటివరకు కురుస్తున్న వర్షాలకు దాదాపు 300 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది.
పాకిస్థాన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు పొటెత్తడంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. జూన్ 26 నుంచి ఇప్పటివరకు కురుస్తున్న వర్షాలకు దాదాపు 300 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది.
గత కొన్ని రోజుల నుంచి మధ్యప్రదేశ్లో కురిసిన వర్షాలకు 252 మంది ఇప్పటి వరకు మరణించినట్లు తెలుస్తోంది. ఎన్నో జంతువులు కూడా ఆ వరదల్లో కొట్టుకొనిపోయాయి. మూడు వేలకు మందికి పైగా ప్రజలను అధికారులు రక్షించారు.
ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఆగస్టు 9 వరకు (6 రోజులు) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తర, తూర్పు, పశ్చిమ, మధ్య భారతదేశంలో భారీ వర్షాలు, తుఫాను గాలులు ఉంటాయని తెలిపింది.
పాకిస్తాన్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా ఇస్లామాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దాదాపుగా 270 మంది ఈ వరదల కారణంగా మృతి చెందారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తెలంగాణలో మరో నాలుగురోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
రాష్ట్రంలో బుధవారం కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.