5 లక్షల కోట్ల స్కాం.. | BJP Paidi Rakesh Reddy Revealed Facts In KTR Scam | Formula E Car Race | RTV
తెలంగాణలో బీర్ల అమ్మకాలను నిలిపివేయాలని యూనైటెడ్ బ్రూవరీస్ తీసుకున్న నిర్ణయంపై హరీశ్ రావు అనుమానం వ్యక్తం చేశారు. బూంబూం బీర్, బిర్యానీ వంటి లోకల్ బ్రాండ్లను ప్రమోట్ చేసేందుకే ఉద్దేశపూర్వకంగా ఇలా ప్రయత్నిస్తున్నారా అని ప్రశ్నించారు.
2024 బీఆర్ఎస్ పార్టీకి ఏ మాత్రం కలిసి రాలేదు. కవిత అరెస్ట్, ఎంపీ ఎన్నికల్లో సున్నా సీట్లు, పది మంది ఎమ్మెల్యేలు జంప్, కేటీఆర్ పై ఏసీబీ కేసు ఇలా కారు పార్టీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. కేసీఆర్ ప్రజల్లోకి రాకపోవడం సైతం ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావును జనవరి 9 వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అంతకు ముందు డిసెంబర్ 30 వరకు హరీశ్ రావును అరెస్టు చేయొద్దని ఇచ్చిన ఆదేశాలను నిన్న పొడిగించింది.
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వ్యవహారంలో కేసీఆర్, హరీశ్ రావుకు ఊరట లభించింది. వారికి భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను హైకోర్టు సస్పెండ్ చేసింది. కేసీఆర్, హరీశ్ రావు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ చేసిన న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
మేడిగడ్డ బ్యారేజీ ఇష్యూపై బీఆర్ఎస్ నేత కేసీఆర్, హరీష్ రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. ప్రాజెక్టు అవకతవకలపై భూపాలపల్లి కోర్టు జూలైలో పంపిన నోటీసులు కొట్టివేయాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.