BIG BREAKING : సీఎం రేవంత్ రెడ్డి సంచలన  ప్రకటన.. అక్రమ మైనింగ్‌పై సీఐడీ విచారణ!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.  రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్‌పై సీబీసీఐడీ విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి పొంగులేటికి సంబంధించిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సంస్థతో పాటు

New Update
CM Revanth

CM Revanth

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.  రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్‌పై సీబీసీఐడీ విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి పొంగులేటికి సంబంధించిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సంస్థతో పాటు ఇతర సంస్థలన్నింటిపై సమగ్ర విచారణ జరిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. 

 రాఘవ కన్స్ట్రక్షన్స్ నడుపుతున్న క్రషర్లకు ఎలాంటి అనుమతులు లేవని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కామెంట్స్ చేశారు. పొంగులేటి మంత్రిగా ఉండగా రాఘవ క్రషర్స్ అక్రమ మైనింగ్ మీద సరిగ్గా ఎంక్వైరీ చేయరని హరీష్ రావు ప్రశ్నించారు. అందుకే పొంగులేటి మంత్రి పదవికి రాజీనామా చేసి ఈ అక్రమ మైనింగ్‌పై ఎంక్వైరీకి ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. 

అక్రమ మైనింగ్‌కు వీరిద్దరే నాయకత్వం

 గత ప్రభుత్వంలోని కీలక నేతలపై సీఎం నేరుగా విమర్శలు గుప్పించారు.  గంగుల కమలాకర్, వద్దిరాజు రవిచంద్ర వీరి మైనింగ్ వ్యాపారాలపై విచారణ చేస్తామని సీఎం ప్రకటించారు. సిరిసిల్ల ప్రాంతంలో జరిగిన ఇసుక అక్రమ దందాపైన కూడా విచారణ జరిపిస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో కేటీఆర్, హరీష్ రావు అక్రమ మైనింగ్‌కు వీరిద్దరే నాయకత్వం వహించారని సీఎం ఆరోపించారు. 

గతేడాది జూన్ 2 నుంచి ఇప్పటివరకు ఇచ్చిన అన్ని మైనింగ్ లీజులపై విచారణ జరిపిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విచారణ నివేదికలను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే సభ ముందు పెడతామని వెల్లడించారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న బెదిరింపులకు లేదా బ్లాక్ మెయిల్స్‌కు తాము భయపడే ప్రసక్తే లేదని సీఎం తేల్చి చెప్పారు. సీఐడీ విచారణ ద్వారా వాస్తవాలను బయటకు తీసి, అక్రమాలకు పాల్పడిన వారిని నిగ్గుతేలుస్తామన్నారు సీఎం రేవంత్.  

Advertisment
తాజా కథనాలు