బావబామ్మర్దిని వారం మూసీల ఉంచితే | CM Revanth Reddy On Harish Rao | Musi River Demolition | RTV
ప్రభుత్వం మూసీ పరివాహక బాధితులు ఇళ్లు ముట్టుకోకుండా బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చారు. కొడంగల్‌లో రేవంత్ రెడ్డి ఇల్లు కుంటలోనే ఉందని.. ముందు దాన్ని కూలగొట్టాలన్నారు. బలిసినోడికి ఓ న్యాయం, పేదోడికి ఓ న్యాయమా అంటూ విమర్శించారు.
TG: హైడ్రా బాధితులతో హరీష్ రావు భేటీ అయ్యారు. హైడ్రా పేదల పాలిట హైడ్రోజన్ బాంబులా మారిందని అన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజలను ఇబ్బందిపెట్టలేదన్నారు. మూసీపై అఖిలపక్షం సమావేశం తర్వాత ముందుకెళ్లాలని సీఎం రేవంత్‌కు సూచించారు.
గాంధీనీ నిన్న హౌస్ అరెస్ట్ చేసి ఉంటే ఇంత జరిగేది ఉండేది కాదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. గాంధీకి ఎస్కార్ట్ ఇచ్చి మరీ దాడికి పంపారు.. ఇది ముమ్మాటికీ రేవంత్ చేసిన దాడే అంటూ మండిపడ్డారు. రేవంత్ పాలన ఎమర్జెన్సీ పాలనల ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిన్న పోలీసులు అరెస్ట్ చేస్తున్న సమయంలో హరీశ్ రావు భుజానికి గాయమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల నిమిత్తం ఆయన గచ్చిబౌలిలోని AIG ఆస్పత్రికి వెళ్లారు. హౌజ్ అరెస్ట్ లో ఉండడంతో పోలీసులు కూడా ఆయన వెంట ఆస్పత్రికి వెళ్లారు.
జన సందోహం మధ్య హరీష్ రావు హైదరాబాద్ కు బయలుదేరారు. మద్దతుగా నిలిచిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు హరీష్ రావు. రాష్ట్ర డీజీపీ తమతో మాట్లాడి కౌశిక్‌రెడ్డి ఇంటి మీద దాడి చేసిన వారి మీద 307 కింద కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారని ఆయన చెప్పారు.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీ, అనుచరులను అరెస్టుల చేయాలని డిమాండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టిన హరీశ్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కందుర్గ్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య వివాదం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీశ్ రావు హుటాహుటిన సిద్దిపేట నుంచి కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లనున్నారు.