Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. 16 మంది మృతి
ఇండోనేసియాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సులవేసి ద్వీపంలోని నర్సింగ్ హోమ్‌లో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 16 మంది సజీవ దహనమవ్వడం కలకలం రేపుతోంది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ఇండోనేసియాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సులవేసి ద్వీపంలోని నర్సింగ్ హోమ్‌లో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 16 మంది సజీవ దహనమవ్వడం కలకలం రేపుతోంది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్ద ఆదివారం అర్థరాత్రి ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా సుమారు 2 వేల మందిని మరో ట్రైన్ లో సురక్షితంగా వారివారి గమ్యస్థానాలకు చేర్చారు.
ఎన్నికల విజయోత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. గెలుపు సంబరాల్లో అగ్నిప్రమాదం సంభవించింది. మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల తర్వాత సంబరాలు మిన్నంటాయి. అయితే, పుణె జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జేజూరీలో ఈ సంబరాలు విషాదాన్ని నింపాయి.
ఢిల్లీ - ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉత్తరప్రదేశ్‌లోని హైవేపై నాలుగు బస్సులు మంటల్లో కాలిపోతున్నాయి. ఈ ప్రమాదం చాలా తీవ్రత ఎక్కువగా ఉండటంతో అనేక మంది మృతి చెంది ఉంటారని స్థానికులు భయపడుతున్నారు.
గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాదంలో 25 మంది మరణించారు. దీని తరువాత ఆ క్లబ్ యజమానులు సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రా దేశం విడిచి పారిపోయారు. దీంతో వీరిని పట్టుకునేందుకు పోలీసులు బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది.
ఇండోనేషియా రాజధాని జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం ఓ ఏడంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
గోవాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బర్చ్ బై రోమియో లేన్’ నైట్ క్లబ్లో శనివారం అర్ధరాత్రి సిలిండర్ పేలి 23 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.