GOA: గోవా నైట్ క్లబ్ లో ఘోర అగ్ని ప్రమాదం..

గోవాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బర్చ్‌ బై రోమియో లేన్‌’ నైట్‌ క్లబ్‌లో శనివారం అర్ధరాత్రి సిలిండర్‌ పేలి 23 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.

New Update
goa

ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో బర్చ్‌ బై రోమియో లేన్‌’ నైట్‌ క్లబ్‌లో నిన్న అర్థరాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సిలిండర్ పేలి 23 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు పర్యటకులు ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా వారంతా క్లబ్ సిబ్బందిగా గుర్తించారు. ఇందులో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. చనిపోయిన వారిలో ముగ్గురు సజీవదహనం అవ్వగా...20 మంది ఊపిరాడక చనిపోయారని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన నైట్‌క్లబ్‌ రాజధాని పనాజీకి 25 కి.మీ దూరంలో ఉంది. గతేడాది దీన్ని ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.  

భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే..

పేలుడు సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర బృందాలు ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాయి. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ కుమార్ కూడా సంఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించారు. ప్రమాదంపై వివరణాత్మక దర్యాప్తు నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. నైట్ క్లబ్ లో భద్రతా చర్యలు సరిగ్గా పాటించకపోవడం వల్లనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విచారణలో భద్రతా ప్రమాణాలు పాటించనట్లు తేలితే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం ప్రమోద్ కుమార్ తెలిపారు. నైట్ క్లబ్ నడిచేందుకు అనుమతిచ్చిన అధికారులపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అగ్ని ప్రమాదం సంఘటన దురదృష్టకరమని..మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాని సీఎం అన్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎమ్మెల్యే లోబో చెప్పారు. దీని తరువాత ఆ ప్రాంతంలో ఉన్న నైట్ క్లబ్ లు అన్నింటిలోనూ తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. అనుమతులు లేని క్లబ్ ల లైసెన్స్ లు రద్దు చేయిస్తామని అన్నారు.

Advertisment
తాజా కథనాలు