Cricket: నేటి నుంచే ఇంగ్లాండ్- భారత్ టీ 20 సిరీస్
ఆస్ట్రేలియా సీరీస్ ఓటమి తర్వాత టీమ్ ఇండియా మరో సీరీస్ కు సిద్ధమైంది. అక్కడ పరాజయాలను ఇంగ్లాండ్ తో జరిగే టీ 20 సీరీస్ తో తుడిచేయాలని భావిస్తోంది. ఈ రోజు నుంచి జరగనున్న టీ20కు రెడీ అయింది.
ఆస్ట్రేలియా సీరీస్ ఓటమి తర్వాత టీమ్ ఇండియా మరో సీరీస్ కు సిద్ధమైంది. అక్కడ పరాజయాలను ఇంగ్లాండ్ తో జరిగే టీ 20 సీరీస్ తో తుడిచేయాలని భావిస్తోంది. ఈ రోజు నుంచి జరగనున్న టీ20కు రెడీ అయింది.
ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్లో దొంగలు పడ్డారు. నగలు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. ఈ విషయాన్ని నెట్టింట వెల్లడించిన స్టోక్స్.. వెలకట్టలేని మెడల్స్ తిరిగి ఇవ్వాలంటూ దొంగలను రిక్వెస్ట్ చేశాడు.
పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ కు పీసీబీ షాక్ ఇచ్చింది. ఇంగ్లాండుతో మొదటి టెస్టులో ఫేలవ ప్రదర్శన కారణంగా మిగతా రెండు టెస్టులకు దూరం పెట్టింది. దీనిపై పాక్ క్రికెటర్లనుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బాబర్‌కు విశ్రాంతినిచ్చామని పీసీబీ చెబుతోంది.
ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ టెస్టు క్రికెట్లో రికార్డులు నెలకొల్పుతున్నాడు. పాక్‌తో తొలి టెస్టులో 262 పరుగులు చేసిన రూట్.. అత్యధిక 250+స్కోరు చేసిన మూడో ఇంగ్లాండ్ బ్యాటర్‌గా నిలిచాడు. సెహ్వాగ్ తర్వాత పాక్‌పై రెండోసారి 250+ పరుగులు చేసిన ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు.
ఇంగ్లాండ్ 2019 వరల్డ్ కప్ హీరో, టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ మరోసారి వన్డే, టీ20ల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపాడు. 'పరిమిత ఓవర్ల కోచ్‌గా ఎంపికైన బ్రెండన్ మెకల్లమ్ మళ్లీ ఆడాలని అడిగితే నో చెప్పలేను. ఆయన అడగకపోయినా ఏమీ బాధపడను'అన్నాడు.
ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 'ఇప్పటికే చాలా క్రికెట్ ఆడేశా. యువతరం జట్టులోకి రావాలి. జట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నా' అని అలీ చెప్పాడు. కెరీర్లో 6,600 పరుగులు చేసి, 360 వికెట్లు తీశాడు.
బర్మింగ్‌హామ్ టెస్టులో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 3-0తో ట్రోఫీని కైవసం చేసుకుంది. లార్డ్స్, నాటింగ్‌హామ్ టెస్టులో ఓడిన వెస్టిండీస్ మూడో టెస్ట్ ను కూడా చేజార్చకుంది.
బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు లో ఇంగ్లాడ్ 94 పరుగుల ఆధిక్యం సాధించింది. ఈ టెస్ట్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 376 పరుగులు చేసి ఆలౌటైంది.తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టీండీస్ 282 పరుగులకు కుప్పకూలింది.
ఇంగ్లాండ్,వెస్టీండీస్ మధ్య జరగుతున్న రెండవ టెస్టులో మూడవ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 207 పరుగుల ఆధిక్యం సాధించింది.మొదటి ఇన్నింగ్స్ లో 416 పరుగులు చేసి ఇంగ్లాండ్ ఆలౌటయ్యింది. తర్వాత బ్యాటింగ్ చేసిన వెస్టీండీస్ జట్టు 457 పరుగులు చేసి 10 వికెట్లు కోల్పొయింది.