బాబర్‌కు పీసీబీ బిగ్ షాక్.. టెస్టుల నుంచి ఔట్!

పాక్ స్టార్ బ్యాటర్ బాబర్‌ అజామ్ కు పీసీబీ షాక్ ఇచ్చింది. ఇంగ్లాండుతో మొదటి టెస్టులో ఫేలవ ప్రదర్శన కారణంగా మిగతా రెండు టెస్టులకు దూరం పెట్టింది. దీనిపై పాక్ క్రికెటర్లనుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బాబర్‌కు విశ్రాంతినిచ్చామని పీసీబీ చెబుతోంది.

author-image
By srinivas
New Update
drerer

Babar Azam: పాక్ క్రికెటర్, మాజీ కెప్టెన్ బాబర్‌ అజామ్ కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ షాక్ ఇచ్చింది. ఇంగ్లాండ్ (England) తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్ లో మొదటి టెస్టులో ఘోరంగా విఫలమైన బాబర్ పై వేటు వేసింది. మిగతా రెండు టెస్టుల నుంచి బాబర్ ను తప్పిస్తూ పీసీబీ (PCB) సెలక్షన్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. అయితే స్టార్ బ్యాటర్ ను తప్పించడంపై ఆ దేశ ఆటగాళ్లనుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఫకర్‌ జమాన్‌ (Fakhar Zaman) దీనిని ఖండిస్తూ.. పీసీబీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

ఇది కూడా చదవండి: దివాలా తీసిన డీమార్ట్‌ షేర్స్.. రూ. 27 వేల కోట్లు ఆవిరి!

జట్టుపై తీవ్ర ప్రభావం..

ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో పాక్‌ ఇన్నింగ్స్‌ తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. కాగా ఈ మ్యాచ్‌లో బాబర్‌ 30, 5 పరుగులే చేశాడు. దీంతో ఇంగ్లాండ్‌తో మిగతా రెండు టెస్టుల కోసం ప్రకటించిన పాకిస్థాన్‌ జట్టులో బాబర్ కు చోటు దక్కలేదు. దీంతో పీసీబీ నిర్ణయంపై ఫకర్‌ జమాన్‌ ఎక్స్‌లో ఫైర్ అయ్యాడు. ‘విరాట్‌ కోహ్లీని టీమ్‌ఇండియా ఎప్పుడూ  తొలగించలేదు. విరాట్ తో సమానుడైన బాబర్‌ పై పీసీబీ తీసుకున్న నిర్ణయం సరైనది కాదు. ఇది ఆందోళన కలిగిస్తోంది.  బాబర్ ఒక అత్యుత్తమ బ్యాటర్‌. స్టార్‌ ప్లేయర్‌ను పక్కనపెట్టడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇకనైన పీసీబీ ఆటగాళ్లకు అండగా నిలిచేందుకు ప్రయత్నించాలి’ అంటూ అసహనం వ్యక్తం చేశాడు. 

ఇది కూడా చదవండి: దివాలా తీసిన డీమార్ట్‌ షేర్స్.. రూ. 27 వేల కోట్లు ఆవిరి!

బాబర్‌కు విశ్రాంతినిచ్చాం..

అయితే బాబర్‌కు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారని పీసీబీ చెబుతోంది. ఈ నిర్ణయాన్ని బాబర్‌ అంగీరించాడని, ఆటగాళ్లకు విశ్రాంతినిస్తే వారు పుంజుకోవడానికి అవకాశం ఉంటుందని తాము నమ్ముతున్నట్లు పీసీబీ తెలిపింది. ఇక అక్టోబర్‌ 15 నుంచి రెండో మ్యాచ్‌ కోసం ఇంగ్లండ్‌ తుది జట్టును కూడా ఇవాళే ప్రకటించారు. గాయం నుంచి కోలుకున్న రెగ్యులర్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ తిరిగి జట్టులోకి రాగా.. పేసర్‌ గస్‌ అట్కిన్సన్‌ స్థానంలో మరో పేసర్‌ మాథ్యూ పాట్స్‌ను తుది జట్టులో స్థానం దక్కింది. క్రిస్‌ వోక్స్‌ స్థానంలో బెన్‌ స్టోక్స్‌ తుది జట్టులోకి రాగా.. ఓలీ పోప్‌ నుంచి స్టోక్స్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు.

ఇది కూడా చదవండి: Bishnoi Gang సల్మాన్ ఖాన్‌ను చంపాలనుకోవడానికి అసలు కారణం ఇదే?

పాక్‌ తుది జట్టు..
సైమ్‌ అయూబ్‌, అబ్దుల్లా షఫీక్‌, షాన్‌ మసూద్‌ (కెప్టెన్‌), కమ్రాన్‌ గులామ్‌, సౌద్‌ షకీల్‌ (వైస్‌ కెప్టెన్‌), మొహమ్మద్‌ రిజ్వాన్‌ (వికెట్‌కీపర్‌), సల్మాన్‌ అలీ అఘా, ఆమెర్‌ జమాల్‌, నౌమన్‌ అలీ, సాజిద్‌ ఖాన్‌, జహిద్‌ మెహమూద్‌

ఇది కూడా చదవండి: TGPSC Group-1: గ్రూప్-1 హాల్ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ లింక్ ఇదే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH vs GT : సన్‌రైజర్స్కు చుక్కలు చూపించిన హైదరాబాద్ బౌలర్!

ఉప్పల్ స్డేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్‌రైజర్స్ ను గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ దారుణంగా దెబ్బకొట్టాడు.

New Update
srh 150 runes

srh 150 runes

ఉప్పల్ స్డేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్‌రైజర్స్ ను గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ దారుణంగా దెబ్బకొట్టాడు. నాలుగు ఓవర్లలో  కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన నాలుగు వికెట్లు తీశాడు.  ట్రావిస్ హెడ్ (8), అభిషేక్ శర్మ (18) లను మొదట్లోనే  వెనక్కి పంపిన సిరాజ్.. డేంజరెస్ ఆటగాడు అనికెత్ వర్మ(18) ను ఎల్బీగా వెనక్కి పంపించాడు. సన్‌రైజర్స్ ఆటగాళ్లలో నితీష్ కుమార్ రెడ్డి(31), హెన్రిచ్ క్లాసెన్(27), పాట్ కమ్మిన్స్ (22) పరుగులు చేశారు.  గుజరాత్ బౌలర్ లో మహమ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీయగా.. ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిషోర్ చెరో రెండు వికెట్లు తీశారు.  

సిరాజ్ అరుదైన రికార్డు

మహమ్మద్ సిరాజ్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ లో వంద వికెట్లు తీసిన 12వ బౌలర్ గా రికార్డు సృష్టించాడు. 97 ఐపీఎల్ మ్యాచ్ లలో సిరాజ్ ఈ ఘనత సాధించాడు. ఓవరాల్ గా ఐపీఎల్ లో వంద వికెట్లు తీసిన 26 బౌలర్ గా నిలిచాడు.  సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు..  ట్రావిస్ హెడ్ (8), అభిషేక్ శర్మ (18) లను ఔట్ చేయడం ద్వారా  సిరాజ్ ఈ ఘనత అందుకున్నాడు. 

Also read : Husband attacks wife : కొండాపూర్ లో దారుణం.. గ‌ర్భిణి అయిన భార్యను చంపాలని...

Also read :  మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

Advertisment
Advertisment
Advertisment