Bandi Sanjay First Reaction On Delhi Election Results | ఢిల్లీ ఫలితాలపై బండి సంజయ్ | Arvind kejriwal
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కల్కాజీ స్థానం నుంచి ఆప్ అభ్యర్థి, ఢిల్లీ సీఎం అతిషి విజయం సాధించారు. ఆమె ఈ సీటును రెండోసారి గెలుచుకున్నారు.
కల్కాజీలో బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరి సీఎం అతిషిపై 3,231 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. సీఎం అతిషిపై గెలిచాక కేబినెట్ లో రమేష్ బిధూరికి కేబినెట్ లో హోమ్ మినిస్టర్ పదవి దక్కే అవకాశం ఉందని ఢిల్లీ బీజేపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కేవలం 600 ఓట్ల తేడాతో సిసోడియా ఓటమిని చవిచూశాడు. సిసోడియా ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఉన్న సంగతి తెలిసిందే.
దశాబ్దం పాటు అధికారంలో ఉన్న ఆప్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడటానికి గల కారణాలు ఏమిటి అనేది ఇపుడు పెద్ద ప్రశ్నలుగా మారాయి. క్లీన్ ఇమేజ్ కలిగి ఉన్న కేజ్రీవాల్.. అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం నుండి రాజకీయాల్లోకి వచ్చారు.