Crime: తెలంగాణలో దసరా వేళ విషాదం.. ముగ్గురు మృతి
దసరా పండుగ వేళ నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వాగులో మునిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. చందంపేట మండలం దేవరచర్లలో ఈ ప్రమాదం జరిగింది.
దసరా పండుగ వేళ నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వాగులో మునిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. చందంపేట మండలం దేవరచర్లలో ఈ ప్రమాదం జరిగింది.
వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తాండూరు రైల్వేస్టేషన్లో ఓ ఎస్సై రైలు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. దీంతో అక్కడున్న వారు ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.
తెలంగాణలో క్రైమ్ రికార్డ్ గణనీయంగా పెరిగింది. హత్యలు, అత్యాచారాలు, రోడ్డు ప్రమాదాలు, ఫోర్జరీ మోసాలు పెరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో తన నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు గతంతో పోలిస్తే పెరిగినట్లు నివేదిక స్పష్టం చేసింది.
చిత్తూరులో మైనర్ బాలికపై అత్యాచార యత్నం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 25న నగరవనం పార్క్‌కు వెళ్లిన ఓ ప్రేమ జంటను ముగ్గురు దుండగులు అడ్డుకున్నారు. అనంతరం యువకుడిని బంధించి ఆ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.
పండుగపూట ఏపీ, తెలంగాణలో విషాదాలు నెలకొన్నాయి. రెండు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు చనిపోయారు. బాణసంచా పేలి దంపతులు, పోలంలో ఓ రైతు చనిపోయారు. హైదరాబాద్ లో కూతురు తల్లిని కొట్టి చంపింది.
హైదరాబాద్ లోని కుకట్పల్లి డివిజన్లోని మాధవరం కాలనీలో సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా రెండు వేర్వేరు చోట్ల విషాద ఘటనలు జరిగాయి. ఈ ఘటనల్లో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.
విజయనగరంలో ఆస్తి కోసం ఓ కన్న కొడుకు తండ్రిని దారుణంగా హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. ఆస్తి తనకు దక్కదని అర్ధరాత్రి సమయంలో గునపంపై తండ్రి గుండెలపై గుద్ది గుద్ది దారుణంగా చంపాడు. చంపవద్దని తండ్రి కాళ్లు పట్టుకున్నా వినకుండా దారుణంగా చంపి పరారయ్యాడు.
కేరళలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను హతమార్చి ఏకంగా ఫేస్బుక్ లైవ్‌లోనే ప్రకటించడం కలకలం రేపింది. హత్య తర్వాత భర్త ఇసాక్ (42) పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.