మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్
TG: సీఎం రేవంత్ రెడ్డికి అండగా టీబీజేపీ నేతలు ఉంటారని అన్నారు కేటీఆర్. వంత్ మీద ఈగ వాలకుండా కాపాడుకుంటారని సెటైర్లు వేశారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని విమర్శలు గుప్పించారు.
TG: సీఎం రేవంత్ రెడ్డికి అండగా టీబీజేపీ నేతలు ఉంటారని అన్నారు కేటీఆర్. వంత్ మీద ఈగ వాలకుండా కాపాడుకుంటారని సెటైర్లు వేశారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని విమర్శలు గుప్పించారు.
ఇండియా కూటమిలో చీలకలకు సంకేతాలిస్తూ టీఎంసీ కీలక వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్ తీసుకునే నిర్ణయాలకు తాము రబ్బర్ స్టాంప్ కాబోయే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. అలాగే కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాలను తాము వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది.
మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంతో బీజేపీ నేత ఆశిష్ దేశ్ముఖ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్కు భవిష్యత్తు లేదని.. ఆ పార్టీ నుంచి గెలిచిన 16 మంది ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరాలంటూ పిలుపునిచ్చారు.
TG: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రైతులను ఆగం చేసిందన్నారు కేటీఆర్. రూ.15 వేల రైతుభరోసా కోసం రైతులు.. రూ.12 వేల రైతుభరోసా కోసం రైతుకూలీలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. అసలు రైతు భరోసా ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు.
TG: కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరగా.. త్వరలో మాజీ మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అదానీ అంశంపై చర్చించాలని ఉభయ సభల్లో విపక్షాలు పట్టుబడ్డాయి. సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో నవంబర్ 27కు పార్లమెంటు సమావేశాలు వాయిదా పడ్డాయి.