ఎన్నికల్లో వినేశ్‌ ఫొగాట్‌కు పోటీగా అభ్యర్థిని దింపిన బీజేపీ

హర్యానాలో జులానా అసెంబ్లీ నియోజవర్గం నుంచి వినేశ్‌ పోటీచేస్తున్నారు. అయితే ఆ నియోజకవర్గం నుంచి బీజేపీ.. యూత్‌ లీడర్‌ కెప్టెన్ యోగేశ్‌ బైరాగిని బరిలో దింపింది. దీంతో అక్కడ వినేశ్‌ ఫొగాట్‌ వర్సెస్ యోగేశ్‌ పోటీ నెలకొంది.

New Update
Vinesh Phogat

హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అన్ని పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను వరుసగా విడుదల చేస్తున్నాయి. ఇటీవల స్టార్ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఆమెకు పార్టీ టికెట్‌ కూడా ఇచ్చింది. జులానా అసెంబ్లీ నియోజవర్గం నుంచి వినేశ్‌ పోటీచేస్తున్నారు. అయితే ఆ నియోజకవర్గం నుంచి బీజేపీ.. యూత్‌ లీడర్‌ కెప్టెన్ యోగేశ్‌ బైరాగిని బరిలో దింపింది. దీంతో అక్కడ వినేశ్‌ ఫొగాట్‌ వర్సెస్ యోగేశ్‌ పోటీ నెలకొంది. ఇప్పుడు ఈ నియోజకవర్గమే హాట్‌ టాపిక్‌గా మారింది.      

హర్యానాలో సెప్టెంబర్ 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ మొత్తం 90 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే తాజాగా బీజేపీ 21 అభ్యర్థితో రెండో జాబితాను రిలీజ్ చేసింది. అందులో జులానా నియోజకవర్గం నుంచి యోగేశ్‌ను నిలబెట్టనుంది. యోగేశ్‌.. భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యాక్షుడు, బీజేపీ స్పోర్ట్స్‌ సెల్‌ హర్యానా విభాగానికి కో కన్వీనర్‌గా ఉన్నారు. తన ఫేస్‌బుక్ బయోలో మాజీ పైలట్‌ అని కూడా ఉంది. ఇక బీజేపీ 67 మంది అభ్యర్థులతో మొదటి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే.  

ఉద్యోగాలకు రాజీనామా 

ఇటీవల జరిగిన ఒలంపిక్స్‌లో వినేశ్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు పడ్డ సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఫైనల్లో ఆడకపోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తూ పోస్టులు చేశారు. చివరికి వినేశ్‌, మరో రెజ్లర్ బజరంగ్ పూనియా ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్‌ నేతల సమక్షంలో వీళ్లు పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్‌లో చేరడానికి ముందే భారత రైల్వేలో ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలకు వినేశ్‌, పునియా రాజీనామా చేశారు. కాంగ్రెస్ మొదటి జాబితాలోనే వినేశ్ ఫొగాట్‌ పేరును ప్రకటించింది. మరో రెజ్లర్‌ బజరంగ్ పునియాకు ఆల్ ఇండియా కిసాన్ వర్కింగ్ ఛైర్మన్‌గా బాధ్యతలు బాధ్యతలు ఇచ్చింది. అయితే ఈ ఎన్నికల్లో వినేశ్‌ గెలుస్తుందా ? లేదా? అనేదానిపై ఆసక్తి నెలకొంది.   

 

Advertisment
Advertisment
తాజా కథనాలు