ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: బిగ్ బ్రేకింగ్.. హైకోర్టులో లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్ ఏపీ హైకోర్టులో నారా లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్ ను నారా లోకేష్ దాఖలు చేశారు. By Nikhil 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu lokesh: ఏపీ హైకోర్టులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ హైకోర్టులో టీడీపీ యువనేత నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన మెమోలో లోకేష్‌ను ఏ14గా చేర్చిన సంగతి తెలిసిందే. By BalaMurali Krishna 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Naidu: హైకోర్టుకు చంద్రబాబు.. ప్రయోజనం ఉంటుందా? ఏపీ హైకోర్టులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుని సీఐడీ కస్టడీ కి ఇస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను క్వాష్ చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు చంద్రబాబు. By Nikhil 24 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ..వాదనలు వినిపిస్తున్న హరీశ్ సాల్వే..!! టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో వాదనలు ప్రారంభం అయ్యాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తున్నారు. By Bhoomi 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP High Court: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మళ్ళీ దెబ్బ పడింది. క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. దీనిని సెప్టెంబర్ 19వ తేదీకి ఏపీ హైకోర్టు విచారణను వాయిదా వేసింది. మరోవైపు ఈ నెల 18 వరకు సీఐడీ పిటిషన్ వేసిన కస్టడీ పిటిషన్స్ మీద కూడా ఎలాంటి విచారణ చేపట్టవద్దని ఏసీబీ కోర్టును ఆదేశించింది. By Vijaya Nimma 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP High Court: మార్గదర్శి సంస్థలపై దాడులు చేయొద్దు: ఏపీ హైకోర్టు ఆదేశాలు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే వరకు మార్గదర్శి సంస్థలపై ఎలాంటి దాడులు చేయవద్దని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శి సంస్థలపై పలు ప్రభుత్వ శాఖలు ఇటీవల దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడులను నిరసిస్తూ మార్గదర్శి యాజమాన్యం హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ పై సోమవారం ఏపీ హైకోర్టు విచారణ చేసింది. మార్గ దర్శి తరపున సీనియర్ న్యాయవాదులు నాగముత్తు, మీనాక్షి అరోరా వాదనలు వినిపించారు. వాదనల అనంతరం మధ్యంతర ఉత్తర్వుల కోసం హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఉత్తర్వులు ఇచ్చేంత వరకు మార్గదర్శి సంస్తలపై ఎలాంటి దాడులు చేయవద్దని న్యాయ స్థానం ఆదేశాలు జారీ చేసింది. By E. Chinni 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పంద్రాగష్టు వేడుకల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్రం.. నాటి స్వాతంత్ర్య సమరయోధుల పోరాట ఫలితమే అని పేర్కొన్నారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. మంగళవారం 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా నేల పాడులోని హైకోర్టు ప్రాంగణంలో జాతీయ జెండాను ఆయన ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. వివిధ మతాలు, వర్గాలు ఉన్నప్పటికీ అందరూ కలిసి స్వాతంత్య్రం కోసం ఏకతాటిపై పోరాడటం వల్లే బ్రిటీష్ వాళ్లను తరిమికొట్టామన్నారు. దేశ సరిహద్దుల్లో సైనికులు నిత్యం పహారా కాస్తూ ఉండటం వల్లనే దేశ ప్రజలకు స్వేచ్ఛ కొనసాగుతుందన్నారు. బలమైన రాజ్యాంగాన్ని నిర్మించుకోవడం కారణంగానే ప్రజాస్వామ్య పరిరక్షణ కాపాడుకుంటున్నామని.. ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. నిరక్షరాస్యత,పేదరికం, అవగాహన, చట్టాలు తెలియకపోవటం వల్ల చాలా మంది తమ హక్కుల్ని కాపాడుకోలేకపోతున్నారని చెప్పారు. ఆర్టికల్ 39 ప్రకారం అందరికీ న్యాయ సహాయం అందేలా చూడాలని చెప్పారు. By E. Chinni 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Angallu Clashs Case: అంగళ్లు ఘర్షణ కేసు: దేవినేని ఉమ, నల్లారి కిషోర్ కి హైకోర్టులో ఊరట చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం అంగళ్లులో జరిగిన ఘర్షణల కేసులో తెలుగు దేశం పార్టీ నేతలు దేవినేని ఉమామహేశ్వర్ రావు, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిలకు ఆంధ్ర ప్రదేశ్ కోర్టులో ఊరట లభించింది. సోమవారం వరకు వారిద్దరినీ అరెస్టు చేయబోమని హైకోర్టుకు అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) తెలిపారు. వీరిరువురి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేయగా శుక్రవారం విచారణ జరిగింది. వీరి తరపున సీనియర్ న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, ఎన్వీ సుమంత్ వాదనలు వినిపించారు. అయితే తమకు వివరాలు అందించేందుకు సోమవారం వరకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. సోమవారం వరకు అరెస్ట్ చేయబోమని అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. దీంతో కేసు తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 14వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. దీంతో దేవినేని ఉమ, నల్లరి కిషోర్ లకు సోమవారం వరకు ఊరట లభించింది. By E. Chinni 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్టు.. ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై స్టే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ షాక్ ఇచ్చింది హైకోర్టు. అమరావతి ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఇళ్ల నిర్మాణాన్ని నిలువరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరిలతో కూడిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం.. By E. Chinni 03 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn