Chandrababu:ఇసుక కుంభకోణం కేసు పిటిషన్ మీద హైకోర్టులో విచారణ
ఇసుక కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ మీద ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరింగింది.దీని మీద ఈ నెల 20లోగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 22కు వాయిదా వేసింది.
ఇసుక కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ మీద ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరింగింది.దీని మీద ఈ నెల 20లోగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 22కు వాయిదా వేసింది.
ఇన్నర్ రింగ్ రోడ్ కేస్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ మీద నేడు హై కోర్ట్ లో విచారణ జరిగింది. ఈ నెల 22కి ఈ కేసు విచారణను వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబుకు మంజూరు చేసిన మద్యంతర బెయిల్ షరతులు పెంచాలంటూ సిఐడి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ పై ఈరోజు ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. గతంలో ఇచ్చిన షరతుల్ని కొనసాగించాలంటూ హైకోర్టు ఆదేశించింది.
చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ కు అదనపు షరతులు పెట్టాలని సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. ఇరువైపులా న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును ఎల్లుండికి వాయిదా వేసింది.
రుషికొండ నిర్మాణాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తాము నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికపై మరోసారి విచారణ చేపట్టాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శిని ఆదేశించింది. రుషికొండపై ఉన్న నిర్మాణాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అంతేకాదు, దీనిపై మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబరు 28కి వాయిదా వేసింది.
ఈ రోజు సాయంత్రంలోగా చంద్రబాబు విడుదల అవుతారని ఆయన తరఫు లాయర్లు తెలిపారు. ఒక వేళ ఆలస్యం అయితే.. రేపు ఉదయం విడుదల అవుతారని వెల్లడించారు. భవిష్యత్ లో మిగతా అన్ని కేసుల విషయంలోనూ చంద్రబాబుకు తప్పుకుండా ఊరట లభిస్తుందని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది న్యాయస్థానం.