AP Election: ఏపీలో మరో ఎన్నికకు మోగిన నగారా!
ఏపీలో మరో ఎన్నికకు నగారా మోగింది. ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే నెల 20న ఈ ఎన్నికకు పోలింగ్ జరగనుంది.
ఏపీలో మరో ఎన్నికకు నగారా మోగింది. ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే నెల 20న ఈ ఎన్నికకు పోలింగ్ జరగనుంది.
రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార దుర్వినియోగం చేయడం కూడా రాజ్యాంగాన్ని అతిక్రమించడమేనన్నారు. ఆర్థిక సంస్కరణల వల్లే సంపదను సృష్టించగలమని పేర్కొన్నారు.
ఏపీ రైతులకు చేదు వార్త చెప్పింది వాతావరణశాఖ. దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర రూపం దాల్చింది. వాయువ్య దిశగా గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదులుతూ తమిళనాడు – శ్రీలంకలోని ట్రికోమలి వైపు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్తున్న యాత్రికుల కోసం 62 ప్రత్యేక రైలు సర్వీసులు ఏర్పాటు చేశారు. డిసెంబర్ ఒకటి నుంచి ఈ రైళ్లు..వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 వరకూ ఈ రైళ్లను నడపనున్నారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఆరోపణలపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఎట్టకేలకు విచారణ ప్రారంభించింది. సిట్ కీలక సభ్యులు ఇంకా తిరుపతికి చేరుకోలేదు. కానీ డీఎస్పీల ఆధ్వర్యంలో దర్యాప్తును ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి అదానీ వ్యవహారం మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఇందులో జగన్ ఉండడం గురించి ఆయన ఇవాళ శాసనసభలో ప్రస్తావించారు. తప్పు చేసినది ఎవరైనా ఉపేక్షించమని చెప్పారు. చర్యలు తప్పకుండా తీసుకుంటామని తెలిపారు.