రాజ్యాంగ దినోత్సవం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార దుర్వినియోగం చేయడం కూడా రాజ్యాంగాన్ని అతిక్రమించడమేనన్నారు. ఆర్థిక సంస్కరణల వల్లే సంపదను సృష్టించగలమని పేర్కొన్నారు.

New Update
CBNN

రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార దుర్వినియోగం చేయడం కూడా రాజ్యాంగాన్ని అతిక్రమించడమేనన్నారు. ఆర్థిక సంస్కరణల వల్లే సంపదను సృష్టించగలమని పేర్కొన్నారు. ''భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని అనేక దేశాల రాజ్యాంగాలను పరిశోధించి అందులో ఉన్నతమైన వాటిని తీసుకొని బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారు. 299 మంది విశిష్ట వ్యక్తులు కలిసి రాసిన మహోన్నత గ్రంథం రాజ్యాంగం.

Also Read: ఇదేం వింత రూల్‌ రా అయ్యా.. ఆ జాబ్‌లో చేరాంటే రక్తంతో సంతకం చేయాల్సిందే

అందరికీ సామాజిక న్యాయం చేయాలని, ఆర్థికంగా ముందుకు తీసుకురావాలని, రాజకీయంగా సమతుల్యం తీసుకూరావాలని, అందరికి సమానావకాశాలు తీసుకురావాలని అంబేద్కర్ రాజ్యాంగంలో రాశారు. ఎంత మంచి రాజ్యాగం ఉన్నా దాన్ని అమలు చేసేవారు చెడువారైతే  చెడుగా మారుతుతుంది. ఎంత చెడు రాజ్యాగమైనా దాన్ని అమలు చేసేవారు మంచివారైతే అది మంచిగా మారుతుందని అంబేద్కర్ అన్నారు.

ఓటు అనేది పవిత్రమైన సైలెంట్ రెవిల్యూషన్. అంబేద్కర్ ఇచ్చిన ఓటు చూస్తే బలవంతులు, బలహీనులు అందరికీ ఓటు వుంది. రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసినా దానిని సరిచేసే శక్తి ఓటుకు ఉంది. ఎమర్జెన్సీ లాంటి చీకటి రోజులు వచ్చాయి. 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. ఇలాంటి రాజ్యాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ప్రాథమిక హక్కులను కాలరాసే పరిస్థితులు చూశాం. అధికార దుర్వినియోగం చేయడం కూడా రాజ్యాంగాన్ని అతిక్రమించడమే. దేశంలో సాంఘిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు ఉన్నాయి. ఆర్థిక సంస్కరణల వల్ల సంపద సృష్టిస్తాం.

Also Read: నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం ఎందుకు జరుపుకుంటామో తెలుసా ?

ఇంకా పేదరికం వుంది. పేదరిక నిర్మూలన కోసం ముందుకు వెళ్లాల్సి వుంది. అందరి మనోభావాలు గుర్తు పెట్టుకోవాలి. కులం, మతం, ప్రాతం పేరుతో విడిపోతే ప్రమాదం వస్తుంది. గత ఐదు సంవత్సరాలు మరచిపోదామనుకున్నా. గత ఐదు సంవత్సరాల జీవోలతో పాటు, ఇప్పుడిచ్చే జీవోలను కూడా ఆన్ లైన్ లో పెట్టి ముందుకు పోతున్నాం. చిన్న పిల్లలకు కూడా రాజ్యాంగంపై పూర్తిగా అవగాహన రావాలని'' చంద్రబాబు నాయుడు అన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP News: జగన్ క్షమాపణ చెప్పాలి లేదంటే.. జనమాల శ్రీనివాసరావు స్ట్రాంగ్ వార్నింగ్!

పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ క్షమాపణ చెప్పాలని జనమాల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జగన్ తీరు పోలీసులందరినీ కలవరపాటుకు గురిచేసిందన్నారు. వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఆయన మీద న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.

New Update
jagan-si-sudhakar

Janamala Srinivasa Rao shocking comments on jagan

AP News: పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ క్షమాపణ చెప్పాలని జనమాల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఏపీ పోలీస్ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ గా జగన్ మాట్లాడిన తీరును ఖండిస్తున్నట్లు తెలిపారు. జగన్ తీరు పోలీసులందరినీ కలవరపాటుకు గురిచేసిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి పోలీసులను బట్టలూడదీస్తానని అనడం ఏమిటని మండిపడ్డారు. జగన్ వెంటనే పోలీసులందరికీ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఆయన మీద న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.

ప్రభుత్వాలకు భజన చేయాలా..

ఈ మేరకు పోలీస్ అధికారుల సంఘం ఎప్పుడు ఒకరిపైన విమర్శలు చేయలేదు. ఏ ప్రభుత్వం ఉన్నా.. పోలీసుల మీద తప్పుగా మాట్లాడితే ఖండించాం. మాకు ప్రభుత్వాలకు భజన చేయాల్సిన అవసరం లేదు. పోలీసుల్లో మనోధైర్యాన్ని నింపడానికి మీడియా ముందుకు వస్తున్నాం. వేమగిరి ఎస్సై టీడీపీ నేతలతో తిరిగిన వీడియోలు ఉంటే దానిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. 

Also Read: TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!

ఇదిలా ఉంటే.. వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కానీ గతంలోనే ప్రాజెక్టు పూర్తిచేశామని, జాతికి అంకితం ఇస్తున్నామంటూ జగన్‌ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. నిర్వాసితులకు ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదని, చేయని పనులూ చేసినట్లు చెప్పుకోవడంలో ఆయనకు ఆయనే సాటి అంటూ ఎద్దేవా చేశారు.

Also Read: Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి

jagan | police | srinivas | tdp | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment