BIG BREAKING : రాహుల్ గాంధీకి బిగ్ షాక్: ఎఫ్ఐఆర్ నమోదు!
కాంగ్రెస్ నేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బిగ్ షాక్ తగిలింది. ఆయనకు బ్రిటిష్ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ వస్తున్న ఆరోపణలపై అలహాబాద్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్ నేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బిగ్ షాక్ తగిలింది. ఆయనకు బ్రిటిష్ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ వస్తున్న ఆరోపణలపై అలహాబాద్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
భారత న్యాయవ్యవస్థలో ఒక అరుదైన తీర్పు వెలువడింది. ఏకంగా 42 ఏళ్ల క్రితం నాటి హత్య కేసులో 100 ఏళ్ల వృద్ధుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది.
ఉత్తరప్రదేశ్లో మతం మార్చకుండా వేరే మతంలో వివాహం చేసుకోవడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మతం మార్చుకోకుండా వేర్వేరు మతాలకు చెందిన వ్యక్తులు చేసుకునే వివాహం చెల్లదని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది.
పెళ్లికాకుండా సహజీవనం చేస్తూ.. తల్లిదండ్రులైతే అది తప్పే కాదని అలహాబాద్ హైకోర్టు చెప్పింది. భర్త మరణం తర్వత మరో వ్యక్తితో సహజీవనం చేసి తల్లైన మహిళకి మాజీ అత్తమామల నుంచి బెందిరింపులు వస్తున్నాయి. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు ఇలా చెప్పింది.
ఇటీవల ఓ కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు వివాదాస్పదంగా మారింది. దీంతో సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. హైకోర్టు జడ్జి తీర్పుపట్ల అత్యున్నత న్యాయస్థానం మండిపడింది. జడ్జి కామెంట్లు అమానవీయంగా ఉన్నాయంటూ అభిప్రాయపడింది.
పెళ్ళైన ముస్లిం పురుషులు ఇతర మహిళలతో సహజీవనం చేసే హక్కును పొందలేరని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇందుకు ఇస్లాం మతం ఒప్పుకోదని పేర్కొంది. యూపీలో స్నేహా దేవి, మహ్మద్ షాదాబ్ ఖాన్ రిట్ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.
జ్ఞానవాపి మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. హిందువులు పూజలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇటీవల వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మసీదు కమిటీ సభ్యుడు అంజుమాన్ ఇంతేజామియా వేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది.
విడాకులకు సంబంధించిన భరణం కేసులో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 2015లో దాఖలైన కేసులో ఉద్యోగం లేనందున భరణం చెల్లించలేననే భర్త వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. కూలీగా పనిచేసే సామర్థ్యం ఉన్నప్పుడు భరణం చెల్లించాల్సిందేనని కోర్టు ఆదేశించింది.