BIG BREAKING : రాహుల్ గాంధీకి బిగ్  షాక్: ఎఫ్ఐఆర్ నమోదు!

కాంగ్రెస్ నేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బిగ్ షాక్ తగిలింది. ఆయనకు బ్రిటిష్ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ వస్తున్న ఆరోపణలపై అలహాబాద్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

New Update
Rahul Gandhi

Rahul Gandhi

కాంగ్రెస్ నేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బిగ్ షాక్ తగిలింది. ఆయనకు బ్రిటిష్ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ వస్తున్న ఆరోపణలపై అలహాబాద్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆరోపణల్లో వాస్తవమెంతో తేల్చాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. దీనిపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణ చేపట్టాలని లేదా ఏదైనా కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని ఆదేశించింది. అలాగే, ఈ వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా కోర్టు స్పష్టం చేసింది.

రాహుల్ గాంధీపై ఫిర్యాదు

బీజేపీ కార్యకర్త విగ్నేష్ శిశిర్ గతంలో లక్నోలోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టులో రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ బ్రిటన్‌లో ఒక కంపెనీని స్థాపించారని, ఆ సమయంలో తనను తాను బ్రిటిష్ పౌరుడిగా పేర్కొన్నారని ఆయన ఆరోపించారు. అయితే, పౌరసత్వానికి సంబంధించిన అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదంటూ కింది కోర్టు గతంలో ఆ ఫిర్యాదును తిరస్కరించింది.

కింది కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ విగ్నేష్ శిశిర్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన లక్నో బెంచ్, పౌరసత్వంపై వస్తున్న ఆరోపణలు చాలా తీవ్రమైనవని, వీటిని చట్టప్రకారం ధృవీకరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అందువల్ల తగిన చర్యలు తీసుకుని, పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని అధికారులను ఆదేశించింది.

Advertisment
తాజా కథనాలు