/rtv/media/media_files/2025/03/26/2iy5xnhOMgwdP8jw5OmQ.jpg)
Allahabad HC order
స్త్రీల వక్షోజాలను తాకడం, వారు వేసుకున్న పైజామా దారం విప్పడం వంటివి అత్యాచారం కిందికి రాదంటూ ఇటీవల అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి బుధవారం రోజు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో హైకోర్టు జడ్జి తీర్పుపట్ల అత్యున్నత న్యాయస్థానం ఫైర్ అయింది. జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం ఈ కామెంట్లు ఏమాత్రం సున్నితమైనవి లేవని.. అమానవీయంగా ఉన్నాయంటూ అభిప్రాయపడింది. ఈ వివాదాస్పద ఉత్తర్వుపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. అంతేకాకుండా ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
అసలేం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ కసగంజ్‌లో 2021 నవంబరులో ఓ మహిళ తన 11ఏళ్ల కుతురితో కలిసి బంధువుల ఇంటి నుంచి తిరిగివస్తోంది. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు బాలికను ఇంటి దగ్గర దింపుతామని నమ్మించి బైక్‌పై ఎక్కించుని మార్గమధ్యంలో లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలికను అసభ్యంగా తాకుతూ వెకిలి చేష్టలకు పాల్పడ్డారు. బాలిక అరుపులు విని స్థానికులు స్పందించగా నిందితులు పారిపోయారు. బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో నిందితులపై కేసు నమోదు చేశారు. ఈ కేసు అలహాబాద్ హైకోర్టుకు చేరగా గురువారం విచారణ జరిగింది.
ఈ కేసును మొదట విచారించిన అలహాబాద్ ట్రయల్ కోర్టు.. పోక్సో చట్టంలోని సెక్షన్ 376, సెక్షన్ 18 (అత్యాచారం, నేరం చేయడానికి ప్రయత్నించడం) ప్రకారం నిందితులకు సమాన్లు పంపింది. దీంతో నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే కేసుపై విచారణ జరిపిన జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. 'మైనర్ బాలికల వక్షోజాలను పట్టుకోవడం, పైజామా దారం తెంపివేయడం, పారిపోయే ముందు ప్యాంట్ కిందికి లాగడం అత్యాచారయత్నంగా పరిగణించబడవు. ఇది పోక్సో చట్టంలోని సెక్షన్ 376, సెక్షన్ 15 నేరాల కిందికి రాదు. కానీ పోక్సో సెక్షన్ 9/10, సెక్షన్ 354-B ( లైంగిక వేధింపులు, మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో దాడి) ప్రకారం సమన్లు జారీ చేయొచ్చు అని స్పష్టం చేశారు. దీంతో ఇది వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి అన్నపూర్ణాదేవి మండిపడ్దారు. న్యాయమూర్తి వ్యాఖ్యలు న్యాయస్థానాలపై గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలన్నారు.
Also Read : కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు .. భట్టి వార్నింగ్!