chandrababu in jail day 18: సుప్రీంకోర్టులో బాబు పిటిషన్ మీద విచారణ...17ఏ చంద్రబాబును గట్టెక్కిస్తుందా?

స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు దాఖలు చేసిన ఎస్ఎల్‌పీపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను గత శుక్రవారం హైకోర్టు కొట్టివేయడంతో శనివారం ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

New Update
chandrababu in jail day 18: సుప్రీంకోర్టులో బాబు పిటిషన్ మీద విచారణ...17ఏ చంద్రబాబును గట్టెక్కిస్తుందా?

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ఈరోజు విచారణకు రానుంది. అత్యవసరంగా విచారించాలని ఆయన తరఫున న్యాయవాదులు దాఖలు చేసిన మెన్షన్‌ మెమోను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పరిగణనలోకి తీసుకున్నారు. బుధవారం విచారించాలని నిర్ణయించారు. జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్వీఎన్ భట్ లతో కూడిన ధర్మాసనం దీనిని చేపట్టనుంది. ధర్మాసనం ఎదుట బాబు పిటిషన్‌ 61వ కేసుగా లిస్టయింది. సుప్రీంకోర్టుకు బాబు మూడు విన్నపాలు చేశారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టేయాలని, జ్యుడీషియల్ రిమాండ్ ను సస్పెండ్ చేయాలని, తన మీద విచారణ పూర్తిగా నిలిపేయాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ దురుద్దేశాలతోనే కేసు నమోదు చేశారని, రిమాండ్‌ రిపోర్టులో ఎటువంటి ఆధారాలు చూపించకుండా అక్రమంగా అరెస్టు చేశారని చంద్రబాబు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 2018లో సవరించిన అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17(ఏ) ప్రకారం కేసు నమోదుకు గవర్నర్‌ అనుమతి తీసుకోలేదని పిటీషన్ లో పేర్కొన్నారు. ఇంతకు ముందు చంద్రబాబు పెట్టిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. దీనిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు అయిన స్పెషల్ లీవ్ పిటిషన్ ఇవాళ విచారణకు వస్తోంది.

మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు వేసిన పిటిషన్ కూడా ఈరోజు హైకోర్టులో విచారణ చేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2.15 నివిషాలకు వాదనలు జరగనున్నాయి. ఇందులో బాబు ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు తరుపు న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా వర్చువల్ వాదనలు వినిపించారు. సీఐడీ తరుపున ఏజీ శ్రీరామ్ వాదించారు. దీంతో పాటూ చిత్తూరు అంగళ్ళు ఘటన కేసులోనూ బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇరు వైపు వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో చాలా మంది టీడీపీ నేతలకు బెయిల్ మంజూరైంది. అందుకే బాబుకు కూడా బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన తరుఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేశ్ ను ఏ14 చేర్చారు.

ఇక ఇటు ఏసీబీ కోర్టులో చంద్రబాబును మరోసారి కస్టడీకి ఇవ్వాలనే సీఐడీ పిటీషన్ మీద కూడా ఈరోజే విచారణ జరగనుంది. అటు చంద్రబాబు బెయిల్ పైన ఈ రోజు విచారణ జరగనుంది. సుప్రీంకోర్టుకు ఈ రోజు తరువాత అక్టోబర్ 3వ తేదీ వరకు కోర్టుకు వరుస సెలవులు. దీంతో ఈరోజు ఏం తీర్పు వెలువడుతుందో అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు