International: అంతరిక్షం నుంచి వారు ఎప్పుడు బయటకు వస్తారో..

అంతరిక్షంలో వ్యోమగాములు సనీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌‌ చాల రోజులుగా ఉండపోయారువారు ఎప్పుడు భూమి మీదకు వస్తారో కూడా తెలియడం లేదు. ఇంకా కొన్ని నెలలు టైమ్ పట్టొచ్చని చెబుతోంది నాసా. ఈలోపు వారి ఆరోగ్యం దెబ్బతినే ఛాన్స్‌ ఉన్నాయని అంటున్నారు శాస్త్రవేత్తలు.

New Update
International: అంతరిక్షం నుంచి వారు ఎప్పుడు బయటకు వస్తారో..

Sunitha William : సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతరిక్షం నుండి తిరిగి ఎప్పుడు వస్తారని చూసే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే నాసా ఇచ్చిన సమాచారం పెద్ద షాక్‌ కలిగించింది. వారిద్దరూ జూన్ 5న బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో 13 రోజుల అంతరిక్ష యాత్రకు వెళ్లారు.. కానీ 2 నెలల తర్వాత కూడా వారు తిరిగి రాలేదు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి ఇద్దరు వ్యోమగాములను తిరిగి తీసుకురావడానికి స్టార్‌లైనర్ కాకుండా ఇతర ఆప్షన్లను నాసా పరిశీలిస్తోంది. అందువల్ల, సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ల పునరాగమనం కోసం మరికొన్ని నెలలు వేచి ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి.స్టార్‌లైనర్ వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను అంతరిక్షం నుండి తిరిగి తీసుకురావడానికి అన్ని ఆప్షన్లు పరిశీలిస్తున్నట్లు నాసా తెలిపింది.

భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, వెటరన్ వ్యోమగామి బుచ్ విల్మోర్  జూన్ 5న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి విజయవంతంగా బయలుదేరి జూన్ 22న షెడ్యూల్ ప్రకారం జూన్ 6న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. అయితే వారు ఇప్పటికే భూమికి తిరిగి వచ్చి ఉండాలి. కానీ కొన్ని సాంకేతిక కారణాల లోపంతో ల్యాండింగ్ ఆలస్యమైంది.ఈ సందర్భంలో, సునీత విలియమ్స్ ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉండటం వల్ల బరువు తగ్గడం, కండరాలు ఎముకల సాంద్రత తగ్గడం వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు.

అంతరిక్షంలో గురుత్వాకర్షణ సున్నాగా ఉంటుంది. దీంతో  కండరాలకు ఎముకలకు బరువులు ఎత్తే పని ఉండదు. కాలక్రమేణా, కండరాల ఫైబర్స్ బలహీనపడతాయి. ఎముక కూడా బలహీనపడి విరిగిపోయే అవకాశం ఉంది. రోజంతా అంతరిక్షంలో ఉండడం వల్ల కళ్లపై ఒత్తిడి పెరిగి చూపు మసకబారుతుందని, డబుల్ విజన్ కనిపిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Also Read:Andhra Pradesh: ఏపీ టీడీపీ పొలిట్‌బ్యూరో కీలక నిర్ణయం..వారికే నామినేటెడ్‌ పోస్టులు..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ukraine: భారత కంపెనీలపై రష్యా దాడులు

కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా పదే పదే తిప్పుతోంది. తాజాగా మళ్ళీ ఉక్రెయిన్ పై మళ్ళీ దాడులు చేసింది. ఇందులో కీవ్ లో ఉన్న భారతీయ మందుల కంపెనీ గొడౌన్ పై రష్యా దాడి చేసినట్లు తెలుస్తోంది. 

author-image
By Manogna alamuru
New Update
ukraine

Russia Attacks On Indian Medicine Warehouse

ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోని ఇండియన్ డ్రగ్ కంపెనీ గోడౌన్ పై  శనివారం రష్యా దాడి చేసింది. కుసుమ్ అనే కంపెనీకి చెందిన స్టోరేజ్ పై దాడి జరిగిందని ఢిల్లీలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం తెలిపింది. రష్యా కవాలానే భారతీయ కంపెనీల మీద దాడులు చేస్తోందని ఆరోపించింది. ఉక్రెయిన్ కు నష్టం జరగాలంటే అక్కడ ప్రజలకు అవసరమైన వాటి కొరత తీసుకురావాలని రష్యా భావిస్తోంది. అందుకే పిల్లలు, వృద్ధుల కోసం మందులు నిల్వ చేసే గోడౌన్స్ పై రష్యా దాడులు చేస్తోందని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం విమర్శించింది. భారత్ తో స్నేహం ఉందని చెప్పే రష్యా ఇలా టార్గెట్ చేసి మరీ ఎందుకు దాడులు చేస్తోందని ప్రశ్నించింది. 

ఈ దాడిని ఉక్రెయిన్ లోని బ్రిటన్ రాయబారి మార్టిన్ హారిస్ కూడా ధృవీకరించారు. రష్యా డ్రోన్ల దాడిలో ఔషధాల గోదాము పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు. కుసేమ్ హెల్త్ కేర్ ఉక్రెయిన్ తో పాటూ 29 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 

 today-latest-news-in-telugu | russia | ukraine | indian | medicine 

Also Read: Cricket: వన్డేల్లో కీలక మార్పు..ఒక బంతితోనే..

Advertisment
Advertisment
Advertisment