Bangladesh: విద్యార్ధుల నిరసనతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్

ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బంగ్లాదేశ్‌లో విద్యార్ధులు ఆందోళనలకు దిగుతున్నారు. రోడ్లమీదకు వచ్చి గొడవ పెడుతున్నారు. హాస్టళ్ళపై దాడులు, బస్సులను తగులబెట్టడం లాంటివి చేస్తున్నారు.

New Update
Bangladesh: విద్యార్ధుల నిరసనతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్

బంగ్లాదేశ్‌ అట్టుడికిపోతోంది. విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు.. టైర్లు తగలబెడుతున్నారు.. ఢాకా ఓల్డ్ పల్టాన్‌లో నేషనల్ ప్రెస్ క్లబ్ ముందు రెండు బస్సులకు నిప్పు పెట్టారు. పలు కాలేజీ హాస్టళ్లపై దాడులు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ వీధికెక్కుతున్నారు. ప్రతిభకు పట్టం కట్టాలని డిమాండు చేస్తూ బంగ్లాదేశ్‌లోని విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.

నిరసనకారులతో అధికార అవామీ లీగ్‌ పార్టీ విద్యార్థి సంఘాల నేతలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఆరుగురు చనిపోయారు. 100 మందికిపైగా గాయపడ్డారు. గొడవల కారణంగా బంగ్లాదేశ్‌లోని అన్ని నగరాల్లో పారామిలిటరీ బలగాలను మోహరించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని సంస్కరించి.. ప్రతిభకు పట్టం కట్టాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ప్రస్తుత విధానం ప్రకారం.. 1971లో బంగ్లాదేశ్‌ విముక్త పోరాటంలో అసువులు బాసిన వారి పిల్లలకు, మనవళ్లు, మనవరాళ్లకు 30శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. 10శాతం స్థానిక పరిపాలన జిల్లాల వారికి, 10శాతం మహిళలకు, 5శాతం మైనారిటీ తెగల వారికి, 1 శాతం దివ్యాంగులకు ఇస్తున్నారు. దీన్ని మార్చాలన్న డిమాండ్‌ ఎంతో కాలంగా వినిపిస్తోంది.

Also Read:USA: ట్రంప్ హత్యాయత్నం వెనుక ఇరాన్ హస్తముందా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

America Earth Quake: అమెరికా.. శాన్ డియాగోలో 5.1 తీవ్రతతో భూకంపం

దక్షిణ కాలిఫోర్నియాను 5.1 తీవ్రతతో భూకంపం తాకిందని అమెరికా భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు తెలిపారు.ఇది జూలియన్‌కు దక్షిణంగా 2.5 మైళ్లు కేంద్రీకృతమై ఉందని, ఇది అమెరికా మెక్సికో సరిహద్దు ఎనిమిది మైళ్ల లోతులో ఉందని అధికారులు తెలిపారు.

New Update
Earthquake

Earthquake

America Earth Quake: సోమవారం దక్షిణ కాలిఫోర్నియాను 5.1 తీవ్రతతో  బలమైన భూకంపం తాకిందని అమెరికా భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు తెలిపారు.ఈ భూకంపం జూలియన్‌కు దక్షిణంగా 2.5 మైళ్లు (నాలుగు కిలోమీటర్లు) కేంద్రీకృతమై ఉందని, ఇది అమెరికా మెక్సికో సరిహద్దు నుండి 20 మైళ్ల దూరంలో ఉందని, ఎనిమిది మైళ్ల లోతులో ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే డేటా వెల్లడించింది.

Also Read: Ap Weather Alert: ఏపీలో వచ్చే మూడు రోజులు పిడుగులు,మెరుపులతో వానలు..!

 భూకంపం తర్వాత వరుసగా చిన్న చిన్న ప్రకంపనలు సంభవించాయి.నష్టం జరిగినట్లు ప్రస్తుతానికి ఎలాంటి నివేదికలు లేవు.దక్షిణ కాలిఫోర్నియాలో అనేక పెద్ద భూకంపాలు సంభవించాయి, వాటిలో 1994లో లాస్ ఏంజిల్స్ ప్రాంతంలో నార్త్‌రిడ్జ్‌ను తాకిన భూకంపం చాలా మందిని పొట్టన పెట్టుకుంది.అంతేకాకుండా వేలాది మందిని తీవ్ర గాయాల పాలుచేసి నిరాశ్రయులను చేసింది. బిలియన్ల డాలర్ల నష్టాన్ని కలిగించింది.

Also Read: Waqf Act Protest: బెంగాల్ చల్లబడటం లేదు..మళ్ళీ నిరసనలు, పోలీస్ వాహనానికి మంటలు..

1906లో శాన్ ఫ్రాన్సిస్కోలో సంభవించిన భూకంపం, సునామీకి కూడా కారణమైంది, దీని వలన 3,000 మందికి పైగా మరణించారని అధికారులు తెలిపారు.  కొందరు  భూకంపం తర్వాత సంభవించిన మంటల్లో మరణించారు.

Also Read: Jio Cheapest Recharge Plan: ఇదేంది మావా ప్లాన్ అదిరింది.. జియో చీపెస్ట్ రీఛార్జ్ ధర- 90 రోజులు ఫ్రీ హాట్‌స్టార్

Also Read: UPI Transactions: మరోసారి ఆగిపోయిన యూపీఐ సేవలు.. గందరగోళానికి గురవుతున్న వినియోగదారులు

america | california | earthquake | mexico | latest-news | telugu-news | latest telugu news updates | latest-telugu-news | today latest news | today-latest-news-in-telugu | international-news | international news in telugu | international news telugu | latest-international-news 

Advertisment
Advertisment
Advertisment