Madhya Pradesh: ప్రిన్సిపల్ చెంప పగులకొట్టిన విద్యార్థి..వీడియో వైరల్

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌‌లో ఓ విద్యార్థి ఏకంగా తన స్కూల్ మహిళా ప్రిన్సిపాల్ చెంప పగులగొట్టాడు. ఫీజుల విషయమై ఇద్దరికి మధ్య జరిగిన గొడవలో ఒకరినొకరు కొట్టుకున్నారు. తనను ప్రిన్సిపల్ కొట్టిందన్న కోపంలో విద్యార్థి కూడా చేయి చేసుకున్నాడు.

New Update
Madhya Pradesh: ప్రిన్సిపల్ చెంప పగులకొట్టిన విద్యార్థి..వీడియో వైరల్

Student slapped Principal: ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌‌లో జరిగిన ఈ ఘటన అవాక్కయ్యేలా చేస్తోంది. సీబీఎస్ అనే ప్రైవేట్ స్కల్‌లో చదివిన ఓ విద్యార్థి ధ్రువ్ తన టీసీ, ధ్రువపత్రాలు తీసుకునేందుకు స్కూల్ కి వెళ్ళాడు. అయితే స్కూల్ ప్రిన్సిపల్ మొత్తం ఫీజు చెల్లిస్తేనే మార్క్స్ మెమో ఇస్తానని చెప్పారు. ఈ విషయంలో ఇద్దరూ మాటామాటా అనుకున్నారు. అలా ధ్రువ్, ప్రధానోపాధ్యాయురాలి మధ్య గొడవ కాస్తా పెరిగ పెద్దదయింది. ఈక్రమంలో ప్రిన్సిపల్ విద్యార్ధిని ముందు కొట్టారు. దీంతో కోపోద్రిక్తుడైన ధ్రువ్ తిరిగి మేడమ్‌ చెంప పగుల కొట్టాడు.

ఈ మొత్తం సంఘటన స్కూల్ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. దానికి తోడు ప్రిన్సిపల్ విద్యార్థి ధ్రువ్ మీద పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. అతను కూడా ఇదే పని చేశాడు. దీంతో పోలీసులు ఇద్దరి మీదా కేసు నమోదు చేశారు. అయితే ప్రిన్సిపాల్ పై చేయి చేసుకున్న దళిత విద్యార్థి ధ్రువ్ ను ప్రిన్సిపాల్‌తో సహా ముగ్గురు ఉపాధ్యాయులు తీవ్రంగా కొట్టాడు. ప్రిన్సిపాల్ నిషా సెంగార్, వైస్ ప్రిన్సిపాల్ రాకేష్ సింగ్, రజనీ అనే టీచర్లు విద్యార్థిని కొట్టారు.

ధ్రువ్ పూర్తి ఫీజ కట్టలేదని ప్రిన్సిపల్ చెబుతుండగా..తాను మొత్తం ఫీజు కట్టానని అతను చెబుతున్నాడు. తాను దళితుడిని కావడం వల్లనే ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నాడు.

Also Read: National: ఉద్యోగుల సామాజిక భద్రతకు యూనిఫైడ్ ఫించన్‌ – ‌‌‌23 లక్షల మందికి లబ్ధి 

Advertisment
Advertisment
తాజా కథనాలు