Stock Market : స్టాక్ మార్కెట్ లో ఒక్కరోజులో 5 లక్షల కోట్లు ఆవిరి.. మరి ఈరోజు ఎలా ఉండొచ్చు? స్టాక్ మార్కెట్ నిన్న అంటే మంగళవారం భారీగా నష్టపోయింది. 17 ఏళ్లలో తొలిసారిగా వడ్డీరేట్లను పెంచుతూ బ్యాంక్ ఆఫ్ జపాన్ తీసుకున్న నిర్ణయం ఆసియా దేశాల మార్కెట్లపై ప్రభావం చూపించింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ 5 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు. By KVD Varma 20 Mar 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Stock Market : నిన్న అంటే మార్చి 19న స్టాక్ మార్కెట్(Stock Market) ఒక్కసారిగా కుదేలయింది. అంతకు ముందు సెషన్ లో లాభాల బాటలో నిలిచిన సెన్సెక్స్, నిఫ్టీలు నిన్న భారీగా పతనం అయ్యాయి. దీంతో ఇన్వెస్టర్స్(Investors) సంపద ఒక్కరోజులో 5 లక్షల కోట్ల రూపాయలు ఆవిరి అయిపోయాయి. BSE లో లిస్ట్ అయిన సంస్థల మొత్తం మార్కెట్ క్యాప్ 378.80 లక్షల కోట్ల రూపాయల నుంచి ఒక్కరోజే 373.90 లక్షల కొటాక్ పడిపోయింది. దీంతో ఒకే సెషన్లో ఇన్వెస్టర్స్ భారీగా నష్టపోయారు. నిన్న స్టాక్ మార్కెట్ తీరిదీ.. Stock Market : నిన్న అంటే మంగళ వారం(మార్చి 19) సెన్సెక్స్ 736 పాయింట్లు లేదా 1.01 శాతం పడిపోయి 72,012.05 వద్ద ముగియగా, నిఫ్టీ 50- 238 పాయింట్లు లేదా 1.08 శాతం క్షీణించి 21,817.45 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.36 శాతం నష్టపోగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.04 శాతం దిగువన ముగిసింది. నిఫ్టీ 50 ఇండెక్స్‌లో 41 స్టాక్‌లు నష్టాల్లో ముగియగా, వాటిలో టిసిఎస్ (4.37 శాతం క్షీణత), బిపిసిఎల్ (4.15 శాతం క్షీణత), సిప్లా (3.59 శాతం క్షీణత) టాప్ లూజర్‌లుగా ముగిశాయి. ఎందుకిలా? 17 ఏళ్లలో తొలిసారిగా వడ్డీరేట్లను పెంచుతూ బ్యాంక్ ఆఫ్ జపాన్ తీసుకున్న నిర్ణయం ఆసియా దేశాల మార్కెట్లపై ప్రభావం చూపిందని నిపుణులు చెబుతున్నారు. జాతీయ బిజినెస్ మ్యాగజైన్ లైవ్ మింట్ లో జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ వెల్లడించిన అభిప్రాయం ప్రకారం.. "దేశీయ మార్కెట్‌లో కరెక్షన్ కూడా ప్రీమియం వాల్యుయేషన్‌లపై ఆందోళనలు రేకెత్తించింది. అంతేకాకుండా, అమెరికాలో అంచనా వేసిన దాని కంటే ఎక్కువ ద్రవ్యోల్బణం కారణంగా US ఫెడ్ రేట్ల తగ్గింపు విషయంలో జరుగుతున్న ఆలస్యం కూడా మార్కెట్లపై ప్రభావాన్ని చూపించింది. ప్రస్తుతం ఇన్వెస్టర్స్ రాబోయే యూఎస్ ఫెడ్ రేట్ల ప్రకటన కోసం ఎదురు చూస్తూ.. జాగ్రత్త పడుతున్నారు. అంతేకాకుండా క్రూడ్ ఆయిల్ ధరలు క్రమంగా పెరగడం మార్కెట్(Stock Market) సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీస్తోంది. Also Read: నష్టాల్లో కదులుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు.. పేటీఎం షేర్లు 4 శాతం జంప్! ఈరోజు మార్కెట్ పై నిపుణుల అంచనా.. ఈరోజు కూడా మార్కెట్(Stock Market) కోలుకునే అవకాశాలు తక్కువనే నిపుణులు అంచనా వేస్తున్నారు. యూఎస్ ఫెడ్ రేట్ల ప్రకటన వచ్చే వరకూ ఇన్వెస్టర్స్ ఆచి తూచి స్పందిస్తారని భావిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ప్రస్తుతం ఇన్వెస్టర్స్ సందిగ్ధావస్థలో ఉన్నారని వారంటున్నారు. నిజానికి యూఎస్ ఫెడ్ రేట్లు తగ్గిస్తుందని అంచనాలే ఇప్పటివరకూ ఉండేవి. అయితే, యూఎస్ ద్రవ్యోల్బణం పెరిగినట్లుగా మంగళవారం వెలువడిన వార్తలతో.. ఫెడ్ రేట్లలో తగ్గింపు కానీ, పెంపుదల కానీ ఉండదని నిపుణుల అంచనా. అంటే యధాతథంగా ఫెడ్ రేట్లు ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫెడ్ రేట్ల నిర్ణయం కోసం(Stock Market) ఇన్వెస్టర్స్ ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ప్రభుదాస్ లీలాధర్ టెక్నీకల్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ వైశాలి పరేఖ్.. లైవ్ మింట్ తో పంచుకున్న అభిప్రాయం ప్రకారం.. ఈరోజు అంటే మార్చి 20న నిఫ్టీ 50 కీలకమైన సపోర్ట్ జోన్ 21,500 జోన్ కంటే దిగువన ఉంది. అయితే, 22,000 కంటే పైకి వెళ్లే పరిస్థితిపై కొంత మాత్రమే నమ్మకం ఉంది. ఇక పెట్టుబడిదారులు కొనుగోలు చేయగలిగిన స్టాక్‌ల విషయానికి వస్తే, వైశాలి పరేఖ్ ఈరోజు మూడు ఇంట్రాడే స్టాక్(Intraday Stock) లను సిఫార్సు చేసారు — హైడెల్‌బర్గ్ సిమెంట్ ఇండియా, VRL లాజిస్టిక్స్ అలాగే RBL బ్యాంక్. అదేవిధంగా ఇప్పుడు ఇండెక్స్ చాలా ప్రమాదకరంగా కనిపిస్తోంది. అందువల్ల జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం అని నిపుణులు చెబుతున్నారు. గమనిక: ఈ ఆర్టికల్ కేవలం పాఠకుల అవగాహన కోసం ఇచ్చినది. ఇక్కడ ఇచ్చిన స్టాక్ మార్కెట్ ఇండెక్స్ లు మార్కెట్ వెబ్సైట్ ఆధారితం. ఈ ఆర్టికల్ ఎక్కడైనా పెట్టుబడి పెట్టమని కానీ, ఫలానా స్టాక్ ఎంచుకోమని కానీ సూచించడం లేదు. ఏదైనా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి రిస్క్ తో కూడినది అయి ఉంటుంది. అందువల్ల ఇన్వెస్ట్మెంట్ విషయంలో మీ ఆర్ధిక సలహాదారుని సూచనలు తీసుకుని ముందడుగు వేయాలి. #stock-market #stock-market-review #sensex-today మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి