Tirupathi: పరిమితంగా శ్రీవాణి దర్శనం టికెట్లు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫ్లైన్లో శ్రీవాణి దర్శనం టికెట్ల కోటాను వెయ్యికి పరిమితం చేసింది. జూలై 22వ తేదీ నుంచి ఈ రూల్ అమల్లోకి రానుంది. By Manogna alamuru 19 Jul 2024 in తిరుపతి టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Sri vani Darshan Tickets: తిరుమలలో రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతోంది. ఇందులో సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యం పెంచేందుకు టీటీడీ కొత్త నిర్ణయం తీసుకుంది. ఆఫ్లైన్లో శ్రీవాణి దర్శన టకెట్ల కోటాను రోజుకు 1000కి పరిమితం చేసింది. ఇప్పటికే ఈ టికెట్లను ఆన్‌లైన్‌లో రోజుకు 500కు కుదించారు. ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో కూడా ఈ రూల్‌ను పాటించబోతున్నారు. జూలై 22నుంచి ఇది అమలులోకి రానుంది. రోజులో ఇచ్చే వెయ్యి టికెట్లలో తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో 900 శ్రీవాణి టికెట్లను మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికగా జారీ చేస్తారు.మిగిలిన 100 టికెట్లను శ్రీవాణి దాతలకు విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్‌లో అందుబాటులో ఉంచుతామని టీటీడీ తెలిపింది. బోర్డింగ్ పాస్ ద్వారా తిరుపతి ఎయిర్‌పోర్ట్ కౌంటర్‌లో మాత్రమే ఈ ఆఫ్‌లైన్ టిక్కెట్లు జారీ చేయనున్నట్లు చెప్పింది. Also Read:Cricket: శ్రీలంకతో టీ 20లకు కెప్టెన్‌గా స్కై #tirupathi #tickets #ttd #srivani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి