Indian fishermen: భారత మత్స్యకారులను అరెస్టు చేసిన శ్రీలంక నౌకాదళం..

తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారని భారత్‌కు చెందిన 10 మంది మత్స్యకారులను శ్రీలంక నౌకాదళం అదుపులోకి తీసుకుంది. పాక్‌ జలసంధిలోని పాయింట్‌ పెడ్రోకు ఉత్తరాన ఉన్న జలాల్లో ఈ జాలర్లను అదుపులోకి వారి పడవను స్వాధీనం చేసుకున్నారు.

New Update
Indian fishermen: భారత మత్స్యకారులను అరెస్టు చేసిన శ్రీలంక నౌకాదళం..

భారత జాలర్లను శ్రీలంక నౌకదళం అరెస్టు చేయడం చర్చనీయాంశమైంది. తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారనే ఆరోపణలు చేస్తూ 10 మంది మత్స్యకారులను అదుపులోకి తీసుకుంది. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. పాక్‌ జలసంధిలోని పాయింట్‌ పెడ్రోకు ఉత్తరాన ఉన్న జలాల్లో ఈ జాలర్లను అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారి పడవను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని శ్రీలంక నేవి సోమవారం అధికారిక ప్రకటనలో తెలిపింది.

అదుపులోకి తీసుకున్న జాలర్లను అధికారులకు అప్పజెప్పామని పేర్కొంది. మరో విషయం ఏంటంటే జాలర్లను శ్రీలంక నేవీ అరెస్టు చేయడం రెండ్రోజుల్లోనే ఇది రెండోసారు. గత శనివారం కూడా 12 మంది జాలర్లను అరెస్టు చేసి.. వాళ్లకి చెందిన మూడు పడవలను స్వాధీనం చేసుకున్నారు. ఆ మత్స్యకారులు ఇంటర్నేషనల్ మారిటైం బౌండరీ లైన్‌ను దాటి తమ జలాల్లోకి వచ్చారనే ఆరోపణలతో వాళ్లను అదుపులోకి తీసుకున్నారు.

Also Read: ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ సక్సెస్‌!? దావోస్​ పర్యటనలో రేవంత్​ బిజీబిజీ!

మరోవిషయం ఏంటంటే గత కొన్నేళ్లుగా భారత్, శ్రీలంకల మధ్య ఈ మత్స్యకారుల అంశం సమస్యగా మారిపోయింది. అయితే తమిళనాడు, శ్రీలంకను వేరుచేసే పాక్‌ జలసంధిలో చేపల వేట ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చేపల వేటకు వచ్చిన భారత జాలర్లను కూడా గతంలో శ్రీలంక అధికారులు అరెస్టు చేశారు. అలాగే వారిపై కాల్పులు జరిపిన ఘటనలు కూడా ఉన్నారు. 2023లో శ్రీలంక నౌకాదళం మొత్తం 240 మంది మత్స్యకారుల్ని అరెస్టు చేసింది. ఈ అంశంపై ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగతూనే ఉన్నాయి.

Also Read: స్కిల్‌ స్కామ్‌ కేసులో సుప్రీం తీర్పుపై ఏపీలో నరాలు తెగే ఉత్కంఠ.. కేసు టైమ్‌లైన్‌ ఇదిగో!

Advertisment
Advertisment
తాజా కథనాలు