/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/jaiswal-jpg.webp)
yashasvi jaiswal
బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో కెప్టెన్ రోహిత్ శర్మ ఘోరంగా విఫలమయ్యాడు. దాంతో అతను పూర్తి టెస్ట్‌లకు గుడ్‌బై చెబుతాడని అనుకున్నారు. కానీ రోహిత్ మరికొన్నాళ్ళు తాను ఆడతానని కన్ఫామ్ చేశాడు. అయితే అతను ఆడినా కెప్టెన్ గా కొనసాగించరని మాత్రం కచ్చితంగా తెలుస్తోంది. దాంతో తదుపరి టీమ్ ఇండియా కెప్టెన్ ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో చాలా మంది పేర్లు తెరమీదకు వస్తున్నాయి.
రోహిత్ తరువాత అతని వారసడుగా జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్ అవ్వాలి. కానీ అతనిని నడుం నొప్పి వేధిస్తోంది. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్‌లో కూడా అతను ఆడలేదు. తరువాత టోర్నమెంటులకు కూడా బుమ్రా ఆడతాడా లేదా అనేది సందేహంగా మారింది. బుమ్రా ఫిట్‌ఎస్ ఇలానే ఉంటే అతన కూడా టెస్ట్‌లలో ఎక్కువ కాలం కొనసాగలేకపోవచ్చి అంటున్నారు. అలాంటప్పుడు బుమ్రాను కెప్టెన్ చేసి ప్రయోజనం ఉండదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ కారణంగా సలెక్టర్లు, కోచ్‌లు కూడా ముందడుగు వేయలేకపోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో యంగ్ ప్లేయర్లు యశస్వి జైశ్వాల్, రిషబ్ పంత్ పేర్లు తెర మీకు వచ్చాయి.
తెర మీదకు జైశ్వాల్, పంత్ పేర్లు...
ఇందులో యశస్వి జైశ్వాల్ కెప్టెన్ అయితే బావుంటుందని కోచ్ గంభీర్ అంటున్నాడని తెలుస్తోంది. జైశ్వాల్ కన్సిస్టెంట్‌గా ఆడుతున్నాడు. ఆస్ట్రేలియా టూర్‌లో కూడా ఇతను బాగానే పరుగులు రాబట్టాడు. జైస్వాల్ శ్రద్ధగా ఆట మీద దృష్టిపెట్టే తీరు, తన నిలకడను చూసి సారథిగా నియమించాలని గంభీర్ కోరుతున్నాడట. అయితే చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం అనుభవజ్ఞుడైన పంత్ వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు. అయితే పంత్‌కు దూకుడు ఎక్కువ. కొన్నిసార్లు బాధ్యతారాహిత్యంగా కూడా ఉంటాడు. అలాంటి వాడికి కెప్టెన్‌గా బాధ్యతలు ఇవ్వడం ఎంతవరకు సరైనది అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే వీటన్నిటి మీద బీసీసీఐ ఎలా స్పదిస్తుందో ఇంకా తెలియదు. చివరకు ఎవరిని కెప్టెన్ చేస్తారనేది ఆసక్తిని రేపుతోంది.