/rtv/media/media_files/2025/03/10/J1BmXI6NnLCl0XLA10Lf.jpeg)
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్‌ను చిత్తు చేసి 4 వికెట్ల తేడాతో ట్రోఫీని కైవసం చేసుకుంది.
/rtv/media/media_files/2025/03/10/oTJlizW7cczQ9nN3Atww.jpg)
అయితే ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత వైట్ సూట్ ధరించి రావడం ఇదేమి తొలిసారి కాదు. 2009 నుండి విజేత జట్టులోని ఆటగాళ్లు ఛాంపియన్స్ ట్రోఫీలో తెల్లటి బ్లేజర్లను ధరించడం ప్రారంభించారు. ఆ సమయంలో ఈ టోర్నీని దక్షిణాఫ్రికాలో ఆడగా.. ఆస్ట్రేలియా జట్టు గెలిచి వైట్ బ్లేజర్లను ధరించింది.
/rtv/media/media_files/2025/03/10/CHzUqfCrqz9qJaNFe8Al.jpg)
ఆ తర్వాత ధోనీ సారధ్యంలో 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న తర్వాత టీమిండియా ఆటగాళ్లంతా ఇలానే వైట్ బ్లేజర్స్ ధరించి వేదికపైకి వచ్చారు. ఆ తర్వాత 2017లో ఇలానే జరిగింది. మళ్లీ అదే సాంప్రదాయాన్ని 2025లో కూడా ఐసీసీ నిర్వహించింది.
/rtv/media/media_files/2025/03/10/csFea3197TvHt64iCprR.jpg)
అయితే ఇలా వైట్ బ్లేజర్లు ధరించడానికి ఓ ప్రాముఖ్యత ఉంది. వైట్ షూట్.. ప్లేయర్ల గొప్పతనం, ధృడ సంకల్పాన్ని తెలిపే ఒక ‘గౌరవ బ్యాడ్జ్’ లాంటిదని ఐసీసీ తెలిపింది. జట్లు ట్రోఫీ కోసమే కాకుండా.. తెల్ల కోట్ కోసం కూడా పోటీ పడతాయని పేర్కొంది.
/rtv/media/media_files/2025/03/10/I1I8VHYfsZCQbuSDoPrp.jpg)
ఈ వైట్ షూట్ ఛాంపియన్లు ధరించే గౌరవ చిహ్నంగా భావిస్తారు. ఎందుకంటే.. ఈ ట్రోఫీకోసం వారు పడ్డ కృషి.. తరతరాలకు స్ఫూర్తినిచ్చే అంశాలను ప్రతిబింభిస్తాయని ఐసీసీ తెలిపింది. మిగిలిన టీమ్‌లు కూడా మరోసారి పోటీ పడేలా ఇది ప్రోత్సహిస్తుందని చెప్పుకొచ్చింది.
/rtv/media/media_files/2025/03/10/lr8OPPykuudcHgzE06ct.jpg)
అయితే ఈ సాంప్రదాయం కేవలం ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రమే కనిపిస్తుంది. వన్డే, టీ-20 ప్రపంచ కప్ లలో ఇలాంటిది కనిపించదు.
/rtv/media/media_files/2025/03/10/u8zbZXENNBe7HbrZAlVX.jpg)
రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా జట్టు 9 నెలల్లోనే రెండవ ట్రోఫీని దక్కించుకుంది. 2024 T20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ కెప్టెన్సీలో 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది భారత్.