/rtv/media/media_files/2025/03/31/tsPpXRtdTMBCAttqrSCQ.jpg)
aniket-varma
ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి ఢిల్లీ క్యాపిటల్స్ తమ రెండో విజయాన్ని నమోదు చేసింది. హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ, ఆ జట్టు యువ బ్యాట్స్‌మన్ అనికేత్ వర్మ మాత్రం తనదైన ఆటతో అందర్నీ ఆకట్టుకున్నాడు. 50 పరుగులకే నాలుగు కీలకమైన వికెట్లు పోయి కష్టాల్లో పడిన సన్‌రైజర్స్ జట్టుకు అనికేత్ వర్మ విధ్వంసకరంగా బ్యాటింగ్ చేసి గౌరవప్రదమైన స్కోరును అందించాడు. అక్షర్, కుల్దీప్ లాంటి బౌలింగ్ లో అయితే వరుస బౌండరీలతో హోరెత్తించాడు. అనికేత్ వర్మ 41 బంతుల్లో 74 పరుగులు చేసి చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్ 2025 లో అనికేత్ 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో పరుగులు చేస్తున్నాడు.
ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీకి చెందిన అనికేత్ మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో పుట్టి పెరిగాడు. 2002 ఫిబ్రవరి 5న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జన్మించాడు. మధ్యప్రదేశ్ తరపున దేశీయ క్రికెట్ ఆడాడు. ముష్తాక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ జట్టులో అరంగేట్రం చేశాడు. అనికేత్ మధ్యప్రదేశ్ తరపున మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అతను ఇప్పటివరకు ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కూడా ఆడలేదు. అతను తన క్రికెట్ ప్రయాణాన్ని రైల్వే యూత్ క్రికెట్ క్లబ్ నుండి ప్రారంభించాడు. అతను ఫెయిత్ క్రికెట్ క్లబ్‌లో శిక్షణ తీసుకున్నాడు. మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్, మధ్యప్రదేశ్ స్థానిక T20 టోర్నమెంట్‌లో చాలా పరుగులు చేశాడు. భోపాల్ లెపార్డ్స్ తరఫున ఆరు మ్యాచ్‌ల్లో 273 పరుగులు చేశాడు, అంతేకాకుండా, అండర్-23 వన్డే టోర్నమెంట్‌లో కర్ణాటకపై 75 బంతుల్లో ఎనిమిది సిక్సర్ల సహాయంతో 101 పరుగులు చేశాడు.
మూడు సంవత్సరాల వయసులో తల్లిని కోల్పోయి
అనికేత్ వర్మ కేవలం మూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన తల్లిని కోల్పోయాడు. అనికేత్ తల్లి మరణం తరువాత, అతని తండ్రి మళ్ళీ వివాహం చేసుకున్నాడు. దీంతో అతని మేనమామ అమిత్ వర్మ అనికేత్ బాగోగులు చూసుకున్నాడు. అనికేత్ కు 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతని మామయ్య మొదటిసారి క్రికెట్ అకాడమీలో చేర్పించాడు. అనికేత్ విజయంలో అతని మామ పాత్ర చాలా ముఖ్యమైనది. అతడి మామయ్య లోన్లు తీసుకుని మరి అనికేత్ కి ట్రైనింగ్ ఇప్పించాడు. అనికేత్ వర్మను సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాథమిక ధర రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2025 లో జరిగిన మూడు మ్యాచ్‌లలో అనికేత్ 39 సగటు, 205.26 స్ట్రైక్ రేట్‌తో 117 పరుగులు చేశాడు.
Also Read : Trump-Iran:ఒప్పందం చేసుకోండి..లేకపోతే బాంబు దాడులే..ట్రంప్ హెచ్చరికలు!