Kambli: ‘చక్‌ దే ఇండియా’ పాటకు స్టెప్పులేసిన కాంబ్లీ.. వీడియో వైరల్!

భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ అభిమానులకు డాక్టర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆయన వేగంగా కోలుకుంటున్నట్లు తెలిపారు. 'చక్ దే ఇండియా' పాటకు హాస్పిటల్ సిబ్బందితో కలిసి ఆడి పాడుతున్న వీడియోను షేర్ చేశారు. దీంతో కాంబ్లీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

New Update
Vinod Kambli Dance

Vinod Kambli Dance

Vinod Kambli: భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ అభిమానులకు డాక్టర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇటవల అనారోగ్యంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన కాంబ్లీ.. వే కోలుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాదు స్వయంగా బెడ్ పైనుంచి లేచి నడవటంతోపాటు తమతో ఆడిపాడుతున్నారంటూ వీడియో రిలీజ్ చేశారు. ఈ మేరకు షారుఖ్ ఖాన్ సూపర్ హిట్ సాంగ్ 'చక్ దే ఇండియా' సాంగ్ కు హాస్పిటల్ స్టాఫ్ తో కలిసి పాటలు పాడుతూ డ్యాన్స్‌ చేసిన ఆనంద క్షణాలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుండగా కాంబ్లీ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. 

సచిన్, కపిల్ ఆర్థిక సహాయం.. 

ఇక మూత్ర ఇన్‌ఫెక్షన్, ఇతర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న కాంబ్లీ ఇటీవలే ఠాణే ఆసుపత్రిలో చేరారు. దీంతో వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కాంబ్లీ మెదడులో రక్తం గడ్డ కట్టిందని వెల్లడించారు. అయితే దీనిపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఆయన బాడీ చికిత్సకు సహకరిస్తుందని త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని వైద్య బృందం చెబుతోంది. ఇదిలా ఉంటే.. వైద్యం చేయించుకునేందుకు కాంబ్లీకి ఆర్థిక స్థోమత లేకపోవడంతో చిన్ననాటి స్నేహితుడు సచిన్, కపిల్ దేవ్, బీసీసీఐ కలిసి వైద్య ఖర్చులు భరించేందుకు ముందుకొచ్చారు. సచిన్ తోకలిసి  ఇండియాకు ఎన్నో రికార్డులు తెచ్చిపెట్టిన కాంబ్లీ.. చెడు అలవాట్ల కారణంగా వ్యసనాల బారిన పడి క్రికెట్ కు దూరమయ్యారు.  

ఇది కూడా చదవండి: న్యూ ఇయర్‌లో రానున్న కొత్త రూల్స్ ఇవే!

ఇది కూడా చదవండి: బ్యాడ్ న్యూస్ ఫర్ ఇండియా.. హిట్‌మ్యాన్, కింగ్ రిటైర్ కావడం లేదు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

IPL Match Fixing: ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్.. హైదరాబాదీనే సూత్రధారి.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!

ఐపీఎల్ సీజన్ 18లో మ్యాచ్ ఫిక్సింగ్ ఇష్యూ సంచలనం రేపుతోంది. ఆటగాళ్లను హైదరాబాద్ వ్యాపారి సంప్రదిస్తున్నట్లు గుర్తించిన బీసీసీఐ భద్రతా విభాగం (ACSU) 10 జట్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైనా తమను సంప్రదిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించింది. 

New Update
list

IPL 2025 Match Fixing Hyderabad businessman

IPL Match Fixing: ఐపీఎల్ సీజన్ 18లో మ్యాచ్ ఫిక్సింగ్ ఇష్యూ సంచలనం రేపుతోంది. ఆటగాళ్లను గుర్తుతెలియని వ్యక్తులు సంప్రదిస్తున్నట్లు గుర్తించిన బీసీసీఐ భద్రతా విభాగం (ACSU) 10 జట్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైనా తమను సంప్రదిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించింది. 

కుటుంబాలకు ఖరీదైన బహుమతులు..

ఈ మేరకు ఆటగాళ్లతోపాటు, కోచ్‌, సహాయక సిబ్బంది, యజమానులు, వారి కుటుంబాలకు ఖరీదైన బహుమతులు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. అయితే దీని వెనక హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతనికి బుకీలతో ప్రత్యక్ష సంబంధాలున్నాయని, అతను గతంలోనూ అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. దీంతో ఐపీఎల్‌తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి ACSU వార్నింగ్ ఇచ్చింది. అతడితో ప్రస్తుతం ఏ విధమైన రిలేషన్ పెట్టుకోవద్దని, ముఖ్యంగా టోర్నీకి సంబంధించిన అంశాలను అతనితో ప్రస్తావించకూడదని స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

ఇది కూడా చూడండి: Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!

ఎలా దగ్గరవుతాడంటే..

ఐపీఎల్ జట్లు బస చేస్తున్నహోటల్‌లో ఆటగాళ్లను కలుస్తాడు. వారిని ప్రైవేట్ పార్టీలకు ఆహ్వానిస్తాడు. జట్టు సభ్యులతోపాటు వారి కుటుంబాలకు బహుమతులు ఇస్తాడు. మొదట టీమ్ ఫేవరేట్ ఫ్యాన్స్ గా నటిస్తూ ఖరీదైన హోటళ్లు, ఆభరణాల దుకాణాలకు తీసుకెళ్తాడు. సోషల్ మీడియాలోనూ విదేశాల్లో ఉంటున్న ఆటగాళ్లు, యజమానుల బంధువులను సంప్రదించి మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతున్నట్లు సమాచారం. 

ఇది కూడా చూడండి: MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

IPL 2025 | match-fixing | today telugu news 

Advertisment
Advertisment
Advertisment