Maha kumbh mela: ఈసారి కప్ నమ్‌దే.. గంగాస్నానం చేసిన ఆర్సీబీ జెర్సీ

ఐపీఎల్‌లో ఆర్సీబీ ఇప్పటి వరకు కప్ కొట్టలేదు. ఈ సీజన్‌లో అయినా కప్ కొట్టాలని ఓ వీరాభిమాని వినూత్న ప్రయత్నం చేశాడు. కుంభమేళాలో జెర్సీకి గంగా స్నానం చేయించి, ఈ తర్వాత పూజలు నిర్వహించాడు. ఈ సారి కప్ పక్కా ఆర్సీబీదే అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

New Update
utar rcb

utar rcb Photograph: (utar rcb)

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ ఇప్పటి వరకు కప్ కొట్టలేదు. గత 17 సంవత్సరాల నుంచి ఆర్సీబీ టీమ్‌తో పాటు ఫ్యాన్స్ కూడా ట్రోఫీ కోసం ఎదురు చూస్తున్నారు. టీంలో స్టార్ ప్లేయ‌ర్లు ఉన్నప్పటికీ కప్ కొట్టలేకపోతున్నారు. ఈ సాలా కప్ నమ్‌దే అని అంటూనే ఎంతో ఆత్మ విశ్వాసంగా మ్యాచ్‌ స్టార్ట్ చేస్తారు. కానీ ఆ తర్వాత కప్ మాత్రం రాదు.

ఇది కూడా చూడండి: TG Schools: ప్రైవేట్ బడుల్లో వారికి ఉచిత చదువులు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!

కప్ కొట్టాలని ప్రార్థిస్తూ..

ఆర్సీబీ కప్ కొడితే చూడాలని టీం కంటే ఫ్యాన్స్ ఎక్కువగా అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఎందరో ఫ్యా్న్స్ ఎన్నో ప్రయత్నలు చేశారు. అయితే తాజాగా ఓ అభిమాని ఆర్సీబీ కప్ కొట్టాలని జెర్సీకి గంగాస్నానం చేయించాడు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఆర్సీబీకి ఫ్యాన్ అయిన ఓ వ్యక్తి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జెర్సీకి గంగాస్నానం చేయించాడు. 

ఇది కూడా చూడండి: Crime: ఈ కుక్కర్లోనే ఉడికించి.. ఫినాయిల్‌ తో కడిగి: వెలుగులోకి భయంకర నిజాలు!

త్రివేణి సంగమం దగ్గర ఆర్సీబీ జెర్సీని మూడుసార్లు గంగానదిలో ముంచాడు. ఆ తర్వాత ఈసారి ఆర్సీబీ క‌ప్ గెల‌వాల‌ని ప్రత్యేకంగా పూజలు కూడా చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ సారి కప్ నమ్‌దే అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: Meerpet Incident: 72 గంటలు భార్య శవాన్ని ఉడికించి.. ఆరబెట్టి పొడిచేసి.. ఇదొక భయంకరమైన హత్య!

ఇది కూడా చూడండి: Meerpet Incident:'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా చూపించి.. భార్యను కుక్కర్లో ఉడికించి చంపిన భర్త!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు