U19 WC: అండర్‌-19 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో భూకంపం.. వీడియో వైరల్!

అండర్‌-19 ప్రపంచకప్‌లో భాగంగా ఐర్లాండ్‌ Vs జింబాబ్వే మధ్య క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌లో మ్యాచ్‌ జరుగుతుండగా భూ కంపం సంభవించింది. 20 సెకన్ల పాటు భూమి కంపించగా రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 5.2గా నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. వీడియో వైరల్ అవుతోంది.

New Update
Ireland Vs Zimbabwe

U19 WC Ireland Vs Zimbabwe match earthquake

U19 WC: అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా భయంకరమైన సంఘటన చోటుచేసుకుంది. అండర్‌-19 ప్రపంచకప్‌ లో భాగంగా మంగళవారం ఐర్లాండ్‌ వర్సెస్ జింబాబ్వే మధ్య క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌లో మ్యాచ్‌ జరిగింది. అయితే ఈ మ్యాచ్ మొదలై 6వ ఓవర్ నడుస్తుండగా ఒక్కసారిగా భూకంపం సంభవించింది. సుమారు 20 సెకన్ల పాటు భూమి కంపించగా గ్రౌండ్ లోని కెమెరాలు షేక్ అయ్యాయి. కామెంటరీ బాక్సు సైతం కుదుపులకు గురైంది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 5.2గా నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. 

Also Read:  OTT Movies: మూవీ లవర్స్ కి పండగ.. ఈ వారం ఓటీటీలో బోలెడు సినిమాలు.. లిస్ట్ ఇదే!

Also Read: Thandel Trailer: అక్కినేని ఫ్యాన్స్ కి పండగే .. తండేల్ ట్రైలర్ గూస్ బంప్స్

మీడియా సెంటర్‌ షేక్..

అయితే మ్యాచ్‌కు ఎలాంటి అంతరాయం కలగకపోగా పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ సముద్ర తీరంలో ఏర్పడ్డ ఈ భూకంపం క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌లోనూ స్వల్ప ప్రకంపనలకు కారణమైందని తెలిపారు. ‘భూకంపం సంభవించినపుడు మా పక్కన రైలు వెళ్తున్న దానికంటే ఎక్కువ ప్రకంపనలు వచ్చాయి. గ్రౌండ్ లో కెమెరాలు, మీడియా సెంటర్‌ షేక్ అయిందని కామెంటర్ ఆండ్రూ తెలిపారు. 

Also Read: గూగుల్‌ మ్యాప్స్‌లో మారిన గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో పేరు..కానీ అక్కడ మాత్రం!

Also Read: Arunachal Pradeh: వాటర్ బాంబ్ కు ధీటుగా..చైనా సరిహద్దుల్లో బ్రహ్మపుత్రపై భారీ రిజర్వాయర్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RR VS GT: టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్‌

ఐపీఎల్‌ 2025లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్‌ రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ఆర్‌ఆర్‌ స్టార్ బౌలర్ వనిందు హసరంగ వ్యక్తిగత కారణాల వల్ల దూరమయ్యాడు.

author-image
By B Aravind
New Update
RR vs GT

RR vs GT

ఐపీఎల్‌ 2025లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్‌ రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ఆర్‌ఆర్‌ స్టార్ బౌలర్ వనిందు హసరంగ వ్యక్తిగత కారణాల వల్ల దూరమయ్యాడు. అతడి స్థానంలో ఫజల్‌హక్ ఫారూకీ తుది జట్టులోకి వచ్చాడు. ఇక గుజరాత్ టీమ్‌ ఎలాంటి మార్పులు చేయకుండానే బరిలోకి దిగింది. 

ఈ సీజన్‌లో గుజరాత్‌ మొదటి మ్యాచ్‌లో ఓడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మూడుసార్లు వరుసగా గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. రాజస్థాన్ రాయల్స్‌ టీమ్‌ మొదటి రెండు మ్యాచుల్లో ఓడి.. ఆ తర్వాత వరుసగా రెండుసార్లు గెలిచింది. పాయింట్ల పట్టికలో ఈ టీమ్ ఏడో స్థానంలో ఉంది. 

Also Read: బీహార్ లో దారుణం కేంద్రమంత్రి మనమరాలి దారుణ హత్య

రాజస్థాన్‌ రాయల్స్‌ టీమ్

యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్‌ & వికెట్‌కీపర్‌), నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, ఫజల్‌ హక్‌ ఫారూకీ, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, యుధ్వీర్ సింగ్ చరక్, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే

Also Read: విమానంలో పక్క ప్యాసింజర్‌పై మూత్రం పోసిన వ్యక్తి

గుజరాత్‌ టీమ్ 

సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్‌), జోస్ బట్లర్ (వికెట్‌కీపర్‌), షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ

 

Advertisment
Advertisment
Advertisment