Team India: భారత గడ్డపై టీమిండియా ఫైనల్స్.. గెలిచినవి.. ఓడినవి.. మ్యాచ్‌లివే!

స్వదేశీ గడ్డపై టీమిండియా ఆడిన ఫైనలమ్ మ్యాచ్‌లో గెలిచినవే కాకుండా.. ఓడినవి కూడా ఉన్నాయి. 1993 విజయం నుంచి 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి వరకు టీమిండియా గెలిచినవి, ఓడిన ఫైనల్ మ్యాచ్‌లు ఏవేవో చూద్దాం. 

New Update
india won matches

india won matches

దేశంలో క్రికెట్‌కు ఉన్న ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ ఫార్మాట్‌లో అయిన టీమిండియా ఫైనల్ మ్యాచ్ ఉందంటే.. యావత్ భారత్ పనులు మానుకుని మరి టీవీల ముందు కూర్చుంటారు. అయితే టీమిండియా ఫైనల్ మ్యాచ్ భారత గడ్డపై ఆడుతుందంటే అందరి దృష్టి దీనిపైనే ఇక. స్వదేశీ గడ్డపై టీమిండియా ఆడిన ఫైనలమ్ మ్యాచ్‌లో గెలిచినవే కాకుండా.. ఓడినవి కూడా ఉన్నాయి. 1993 విజయం నుంచి 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి వరకు టీమిండియా గెలిచినవి, ఓడిన ఫైనల్ మ్యాచ్‌లు(matches) ఏవేవో చూద్దాం. 

సొంత గడ్డపై భారత్ గెలిచిన ట్రోఫీలు

1993 హీరో కప్

భారత్‌లో జరిగిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ట్రై-సిరీస్ టోర్నమెంట్లలో ఈ హీరో కప్ ఒకటి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఫైనల్‌లో భారత్.. వెస్టిండీస్‌ను 102 పరుగుల తేడాతో ఓడించింది. అనిల్ కుంబ్లే కేవలం 12 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. టీమిండియా భారత్‌లో సాధించిన అద్భుతమైన విజయాల్లో ఇది ఒకటి. 

ఇది కూడా చూడండి:  Ind Vs Eng: హై ఓల్టేజ్ మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

1996 టైటాన్ కప్

ఈ టోర్నమెంట్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను భారత్ 35 పరుగుల తేడాతో ఓడించి టైటిల్ గెలుచుకుంది. ముంబైలో జరిగిన ఈ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలో భారత్ ట్రోఫీని ముద్దాడింది.

2011 ఐసీసీ వన్డే ప్రపంచ కప్

స్వదేశీ గడ్డపై భారత్ సాధించిన అతిపెద్ద విజయం ఇది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో శ్రీలంకను 6 వికెట్ల తేడాతో ఓడించి.. దాదాపు 28 ఏళ్ల తర్వాత భారత్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో ధోని సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించడంతో గుర్తిండిపోయింది.

ఇది కూడా చూడండి: Pakistan Player Misbehave: నీ కామం తగలెయ్య.. మహిళా హౌస్ కీపింగ్‌తో పాక్ క్రికెటర్ అసభ్య ప్రవర్తన!

సొంత గడ్డపై భారత్ ఓటమిపాలైన ఫైనల్ మ్యాచ్‌లు

2023 ఐసీసీ వన్డే ప్రపంచ కప్

2011 తర్వాత మళ్లీ సొంత గడ్డపై కప్ కొట్టాలని భావించిన టీమిండియాకు 2023 ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌(icc-world-cup-2023)లో నిరాశ మిగిలింది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. వరుసగా10 మ్యాచ్‌లు గెలిచి ఫైనల్ చేరిన భారత్, ఆఖరి పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది.

పెప్సీ కప్ 1999

భారత్, పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. ఈ ఫైనల్‌లో పాక్‌తో తలపడిన భారత్.. ఆ జట్టు నిర్దేశించిన 291 పరుగుల లక్ష్య ఛేదనలో ఘోరంగా విఫలమైంది. కేవలం 167 పరుగులకే ఆలౌట్ అయ్యింది. సొంత గడ్డపై జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా123 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది.

ఇది కూడా చూడండి: Ind Vs Eng: చుక్కలు చూపించిన భారత్.. ఇంగ్లాండ్‌ ముందు భారీ టార్గెట్

కోకాకోలా ఛాంపియన్స్ ట్రోఫీ 1998

మొహాలిలోని పీ.సీ.ఏ స్టేడియంలో కోకాకోలా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. మొదట్లోనే ఆరంభంలోనే సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ వంటి కీలక వికెట్లు కోల్పోయినప్పటికీ, అజయ్ జడేజా (79), మహమ్మద్ అజారుద్దీన్ (47)  ఇన్నింగ్స్‌తో అదరగొట్టారు. అనంతరం 228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 48.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి.. 4 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

టీవీఎస్ కప్ 2003

కోల్‌కతా వేదికగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 235 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ కేవలం 198 పరుగులకే పరిమితమై 37 పరుగులతో ఓడిపోయింది.

ఇది కూడా చూడండి:  Ind Vs Eng: ఫైనల్ కు దూసుకెళ్లిన భారత్.. సెమీస్ లో చేతులెత్తేసిన ఇంగ్లాండ్

Advertisment
తాజా కథనాలు