Ind Vs Eng: ఫైనల్ కు దూసుకెళ్లిన భారత్.. సెమీస్ లో చేతులెత్తేసిన ఇంగ్లాండ్

ఇంగ్లాండ్ తో జరిగిన టి20 వరల్డ్ కప్ సెమి ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. 254 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 7 వికెట్లు కోల్పోయి 246పరుగులకే చేతులెత్తేసింది.  దీంతో భారత్ 7 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 

New Update
India vs England Live Updates

India vs England Live Updates

ఇంగ్లాండ్ తో జరిగిన టి20 వరల్డ్ కప్ సెమి ఫైనల్ మ్యాచ్లో టీమిండియా(team-india) ఘన విజయం సాధించింది. 254 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 7 వికెట్లు కోల్పోయి 246పరుగులకే చేతులెత్తేసింది.  దీంతో భారత్ 7 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 

Also Read :  నీ కామం తగలెయ్య.. మహిళా హౌస్ కీపింగ్‌తో పాక్ క్రికెటర్ అసభ్య ప్రవర్తన!

Team India Won The T20 World Cup Semi Final Match

ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్(ind-vs-eng) బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు సాంసన్ మంచి బ్యాటింగ్ చేశారు. అయితే అభిషేక్ శర్మ ఎక్కువసేపు క్రిజ్ లో ఉండలేకపోయాడు. సింగిల్ నెంబర్ స్కోర్ తో వెనుదిరిగాడు. 7 బంతుల్లో 9 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ సంజు సాంసన్ మాత్రం అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. ఫోర్లు, సిక్సర్లతో పరుగుల వర్షం కురిపించాడు. 42 బంతుల్లో 89 పరుగులు చేసి మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అలాగే ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 39 పరుగులు, శివమ్ దూబే 25 బంతుల్లో 43 పరుగులు, కెప్టెన్ సూర్య కుమార్ 6 బంతుల్లో 11 పరుగులు, హార్దిక్ పాండ్యా 12 బంతుల్లో 27 పరుగులు, తిలక్ వర్మ 7 బంతుల్లో 21 పరుగులు, అక్షర్ పటేల్ (2 బంతుల్లో 2 పరుగులు*), వరుణ్ దావన్ (0*).. ఇలా మొత్తం 253 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు.

దీంతో 254 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఉత్కంఠ భరతమైన ఇన్నింగ్స్ ఆడింది. ఒకానొక సమయంలో గెలుపు ఎవరిది అనే ఉత్కంఠ అందరిలోనూ ఉండేది. ముఖ్యంగా ఇంగ్లాండ్ బ్యాటర్ బెతెల్ అబ్బురపరిచే బ్యాటింగ్ చేశాడు. సెంచరీకి పైగా స్కోర్ చేసి భారత్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. మిగతా వారందరూ చేతులెత్తేయడంతో విజయం భారత్ సొంతమైంది. దీంతో భారత్ 7 పరుగులు తేడాతో విజయం సాధించింది. ఇక ఫైనల్ మ్యాచ్ మార్చి 8వ తేదీన గుజరాత్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ తలపడబోతున్నాయి. 

Also Read :  అదరగొట్టిన వెస్టిండీస్‌.. భారత్‌ ముందు భారీ టార్గెట్

Advertisment
తాజా కథనాలు