Cricket: హమ్మయ్యా...సీరీస్ కొట్టేశారు..నాలుగో టీ20లో భారత్ ఘన విజయం

మూడో మ్యాచ్ లో ఓడిపోయిన టెన్షన్ పెట్టిన టమ్ ఇండియా నాలుగో టీ 20 మ్యాచ్ లో మాత్రం అదరగొట్టారు. దీంతో ఇంకా ఒక మ్యాచ్ మిగిలుండగానే సీరీస్ ను కైవసం చేసుకున్నారు. కీలకమైన నాలుగో మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో విజయబావుటా ఎగురవేసింది భారత జట్టు.

New Update
INDvsENG

India Won The 4th T20 with England

మొత్తానికి సూర్య సేన అనుకున్నది సాధించారు. మధ్యలో కాస్త తడబడనా..వెంటనే పొరపాటును సరిదిద్దుకుని విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు టీ20 సీరీస్ ను భారత జట్టు  సొంతం చేసుకుంది. ఈరోజు పూనేలో జరిగిన కీలక మ్యాచ్ లో టీమ్ ఇండియా సమష్టిగా రాణించడంతో 15 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను మట్టికరిపించింది. 182 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ జట్టు 19.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ 26 బంతుల్లో 51 పరుగులు చేినప్పటికీ ఫలితం దక్కలేదు. భారత బౌలర్లు హర్షిత్‌ రాణా, రవి బిష్ణోయ్‌ చెరో 3 వికెట్లు పడగొట్టగా, వరుణ్‌ చక్రవర్తి 2, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ చెరో వికెట్ తీశారు. 

ఇది కూడా చదవండి: Rythu Bharosa: రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు!

దూబే, పాండ్యా హీరోలు

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సూర్య కుమార్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో కూడ టాప్ ఆర్డర్ విఫలమయ్యింది. సంజూ శాంసన్ 1, అభిషేక్ శర్మ 29 పరుగులకే అవుట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ అయితే ఘోరంగా డకౌట్ అయ్యాడు కూడా.ఒకే ఓవర్లో ఇంగ్లాండ్ బౌలర్ మహమూద్ మూడు వికెట్లను తీసి భారత జట్టును గట్టి దెబ్బ కొట్టాడు. అయితే మూడో డౌన్ లో వచ్చిన రింకూ 26 బంతుల్లో 30 పరుగలతో కాసేపు మెరుపులు మెరిపించడంతో జట్టు మళ్ళీ కోలుకుంది. ఇతని తర్వాత వచ్చిన శివమ్ దూబే 34 బంతుల్లో 53 పరుగులు, హార్దిక్ పాండ్యా 30 బంతుల్లో 53 పరుగులు చేసి అర్థ శతకాలతో జట్టు స్కోరును పెంచారు. దీంతో ఓవర్లు ముగిసే సమయానికి భారత స్కోరు 181 పరుగులు చేయగలిగింది.    

Also Read: Gold: అమ్మో బంగారం..ఆల్ టైమ్ గరిష్టానికి..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

ఐపీఎల్ 2025లో ఈరోజు అద్భుతమైన మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ ఉప్పల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ నువ్వా నేనా అన్నట్టు ఆడారు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 246 పరుగుల టార్గెట్ ఇస్తే దాన్ని ఎనిమిది వికెట్ల తేడాతో ఛేదించింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

SRK VS PBKS

హైదరాబాద్ సన్ రైజర్స్ అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చింది. ఐదు మ్యాచ్ లు ఓడిపోయిన తర్వాత ఈరోజు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ చితక్కొట్టేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు విజృంభించి ఆడేశారు. పజాబ్ కింగ్స్ ఇచ్చిన 246 పరుగుల భారీ టార్గెట్ ను 8 వికెట్ల తేడాతో సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ వర్మ 141 పరుగులు, ట్రావిస్ హెడ్ 66 పరుగులతో ఇరగదీసారు. ఇద్దరూ కలిసి మ్యాచ్ ను గెలిపించేశారు. 150 పరుగుల ముందు అభిషేక్ వర్మ వికెట్ కోల్పోవడం కొంత నిరాశ కలిగించినా...అతను ఈరోజు ఆడిన తీరుతో ఉప్పల్ స్టేడియం మొత్తాన్ని ఉర్రూతలూగించాడు. అభిషేక్‌ శర్మ 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లsy 141 పరుగులు చేసి పంజాబ్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో ఉప్పల్ మైదానంలో పరుగుల వరద పారించాడు. అభిషేక్ ధాటికి పంజాబ్ ఏకంగా ఎనిమిది మందితో బౌలింగ్‌ చేయించింది.  మరోవైపు అతను కొట్టిన బంతులను గ్రౌండ్ స్టాఫ్ వెతుక్కోవడంతోనే సరిపోయింది.  ట్రావిస్ హెడ్ 37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66 పరుగులు చేసి అభిషేక్ కు మంచి సపోర్ట్ ఇచ్చాడు.  చివర్లో క్లాసెన్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌ తో 21, ఇషాన్ కిషన్ 9*; 6 బంతుల్లో 1 సిక్స్ కొట్టి మ్యాచ్ ను గెలిపించారు. 

పంజాబ్ కూడా దుమ్మ రేపింది..

అంతకు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు చెలరేగిపోయింది. తొలి ఇన్నింగ్స్ చేసి కింగ్స్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు సాధించింది. దీంతో SRH ముందు 246 భారీ టార్గెట్ ఉంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఈ మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్స్‌గా క్రీజులోకి ప్రభ్‌మన్ సింగ్‌, ప్రియాంశ్‌ ఆర్య మొదటి నుంచి దంచి కొట్టారు. బాల్‌ టు బాల్ ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశారు. ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పెట్టించారు. సన్ రైజర్స్ జట్టు బౌలర్లకు చెమటలు తెప్పించారు. ఇక హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో (3.6) ప్రియాంశ్‌ ఆర్య (36) నితీశ్‌ రెడ్డికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్ అయ్యార్ దుమ్ము దులిపేశాడు. పరుగులు రాబడుతూ అదరగొట్టేశాడు. ఫోర్లు, సిక్సర్లతో కెవ్ కేక అనిపించాడు. అతడు 36 బంతుల్లో 82 పరుగులు చేసి ఔటయ్యాడు. అలాగే వధేరా 22 బంతుల్లో 27 పరుగులు, శశాంక్ సింగ్ 3 బంతుల్లో 2 పరుగులు, మాక్స్‌వెల్ 7 బంతుల్లో 3 పరుగులు, స్టొయినీస్ 11 బంతుల్లో 34 పరుగులు చేశారు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | srh-vs-pbks

Also Read:  USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

Advertisment
Advertisment
Advertisment