Rishabh Pant: ధోనీని రీప్లేస్ చేయడం కష్టం.. అతడు దేశానికి హీరో: పంత్

MS ధోనీపై రిషబ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుకు రెండుసార్లు వరల్డ్ కప్‌ను అందించిన సారథిగా ధోనీ చిరస్థాయిగా నిలిచిపోతాడని ప్రశంసలు కురిపించాడు. ధోనీ దేశానికి హీరో అని, అతడిని రీప్లేస్ చేయడం కష్టమని అన్నాడు. ఆ దిశగా తాను సాగుతానని తెలిపాడు.

New Update
Interesting Comments On MS Dhoni

Rishabh Pant Interesting Comments On MS Dhoni

టీమిండియా మాజీ కెప్టెన్ MS ధోని.. ఈ పేరు వింటే క్రికెట్ ప్రియుల్లో సరికొత్త ఉత్సాహం. అతడు గ్రౌండ్‌లో అడుగుపెడితే స్టేడియం మొత్తం దద్దరిల్లిపోతుంది. ఫ్యాన్స్ రచ్చ ఓ రేంజ్‌లో ఉంటుంది. ధోని కీపింగ్ చేస్తుంటే ప్రత్యర్థి బ్యాటర్లలో టెన్షన్ టెన్షన్. ఇక ధోని బ్యాట్ పట్టుకుని క్రీజ్‌లోకి వచ్చాడంటే.. అరుపులు, కేకలతో సందడే సందడి. 

ఇది కూడా చూడండి: నేడు ఈ రాశివారికి ధనలాభం..ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే

ఇలా అతడి ఆటకు, సైలెన్స్ డెసిషన్‌కు దేశ వ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అలాగే టీమిండియా జట్టులోనూ ధోనీ అంటే అభిమానించే వారు, గౌరవించే వారు లేకపోలేదు. ఆయనను స్పూర్తిగా తీసుకుని ఆడేవారు టీమిండియా జట్టులో చాలా మందే ఉన్నారు. అందులో స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ ఒకరు. 

ధోనీపై ప్రశంసల వర్షం

పంత్ తాజాగా ఎంఎస్ ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాడు. భారత జట్టుకు రెండు సార్లు వరల్డ్ కప్‌ను అందించిన సారథిగా ధోనీ చిరస్థాయిగా నిలిచిపోతాడని కొనియాడాడు. అంతేకాకుండా ధోనీని రీప్లేస్ చేయడం ఎవరి వల్ల కాదని.. అది చాలా కష్టమని పేర్కొన్నాడు. అయితే ఆ దిశగా తాను సాగుతానని వెల్లడించారు. 

ఇది కూడా చూడండి:  కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షలు వాయిదా

ధోనీ దేశానికి హీరో

ధోనీ దేశానికి హీరో అని ప్రశంసించాడు. అతడి నుంచి వ్యక్తిగతంగా ఎన్నో అంశాలను నేర్చుకున్నానన్నాడు. జట్టులో ధోనీ ఉన్నాడంటే ఎంతో నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నాడు. అంతేకాకుండా తానెప్పుడూ ధోనీతో తన రికార్డుల విషయాన్ని పోల్చుకోనని చెప్పుకొచ్చాడు. ఇక తనకేదైనా సమస్య ఉంటే.. నేరుగా ధోనీతోనే పంచుకుంటానని.. దానికి పరిష్కారం కూడా దొరుకుతుందని పేర్కొన్నాడు. ప్రస్తుతం అతడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live News Updates: పాత వాహనాలకూ కొత్త రిజిస్ట్రేషన్ నంబర్లు

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

New Update
Live News Updates in Telugu

Live News Updates in Telugu

🔴Live News Updates:

TS: పాత వాహనాలకూ కొత్త రిజిస్ట్రేషన్ నంబర్లు

తెలంగాణలో నెంబర్ ప్లేట్లు మార్చాల్సిన టైమ్ వచ్చేసింది. పాతదే అయినా హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ తప్పనిసరి చేసింది రవాణాశాఖ. సెప్టెంబర్ 30వ తేదీని గడువుగా నిర్ణయించింది. 

ts
High Security number plate

 

మీ వెహికల్ 2019 ఏప్రిల్ 1వ తేదీ కన్నా ముందు తయారైందా...అయితే అర్జంటుగా వెళ్ళి నంబర్ ప్లేట్ మార్చుకోండి.  పై తేదీ కన్నా ముందు తయారైన వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ బిగించుకోవాల్సిందేనని తెలంగాణ రవాణాశాఖ చెప్పింది.  దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వాహన రకాన్ని బట్టి నంబర్‌ ప్లేట్‌కు కనిష్ఠంగా రూ.320.. గరిష్ఠంగా రూ.800గా ఛార్జీలను ఖరారు చేసింది. నకిలీ నంబర్‌ ప్లేట్లకు అడ్డుకట్ట వేయడం, దొంగతనాలను అరికట్టడం, వాహనాలు రహదారి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేస్తున్నామని రవాణాశాఖ చెబుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మరకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. 

కచ్చితంగా మార్చాల్సిందే..

పాత వాహనాలకు నంబర్ ప్లేట్ మార్చాల్సి బాధ్యత యజమానిదే అని తేల్చి చెప్పింది రవాణాశాఖ. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ మార్చుకోకపోతే వాహనాలను అమ్మాలన్నీ, కొనాలన్నా సాధ్యం కాదని తెలిపింది. అలాగే బీమా, పొల్యూషన్ సర్టిఫికేట్ లాంటివి కూడా లభించవు. పైగా సెప్టెంబర్ తర్వాత కొత్త నంబర్ ప్లేట్లు కనిపించకపోతే కేసులు కూడా నమోదు చేయనున్నారు.  ఇక ఈ నంబర్ ప్లేట్లు వాహన తయారీ సంస్థలు తమ డీలర్ల దగ్గర కూడా చేయించుకోవచ్చును. దీనికి సంబంధించిన సమాచారం, నంబర్ ప్లేట్ ధరలు డీలర్ దగ్గర కనిపిచేలా చేయనున్నారు. వాహనదారులు ఈ ప్లేట్‌ కోసం www.siam.in వెబ్‌సైట్‌లో ..వాహన వివరాలు నమోదు చేసి బుక్‌ చేసుకోవాలి. కొత్త ప్లేట్‌ బిగించాక ఆ ఫొటోను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి.

Also Read: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?

Also Read:  Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం

Advertisment
Advertisment
Advertisment