Dhanashree: చాహల్‌తో విడాకులపై ధనశ్రీ క్లారిటీ.. ఎన్నో కష్టాలు పడుతున్నానంటూ!

చాహల్‌తో విడాకుల వార్తలపై అతడి భార్య ధనశ్రీ స్పందించారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలపై తాను ఎంతగానో వేదనకు గురవుతున్నట్లు తెలిపారు. నిజా నిజాలు తెలుసుకోకుండా అవాస్తవాలు రాస్తున్నారన్నారు. ఎప్పటికైనా నిజం విజయం సాధిస్తుందని తెలిపారు.

New Update
Chahal and Dhana shree divorce

Chahal and Dhana shree divorce news

టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ - ధనశ్రీ జంట వర్మ విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే ఈ జంట సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు కూడా. అనంతరం చాహల్ తన ఖాతా నుంచి తమ వివాహ బంధానికి సంబంధించిన ఫొటోలను సైతం డిలీట్ చేశాడు. దీంతో చాహల్ - ధనశ్రీ జంట విడాకులు నిజమేనంటూ నెటిజన్లు ఒక అభిప్రాయానికి వచ్చారు. 

ఇది కూడా చూడండి: బాలయ్యకు బిగ్ షాక్.. డాకూ మహారాజ్ ప్రీ రిలీజ్ క్యాన్సిల్!

ఈ నేపథ్యంలో తాజాగా ధనశ్రీ పెట్టిన ఒక పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తోన్న వార్తల కారణంగా తాను ఎంతగానో వేదనకు గురవుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీలో ఒక పోస్టు పెట్టారు. దాని ప్రకారం.. కొన్ని రోజులుగా తాను, తన కుటుంబం అత్యంత కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. 

ఇది కూడా చూడండి: అంతా రెప్పపాటులో జరిగిపోయింది..తిరుపతి ఘటన టైమ్ టు టైమ్ సీన్

ఎన్నో కష్టాలు పడుతున్నాను

అంతేకాకుండా కొందరు నిజా నిజాలు తెలుసుకోకుండా అవాస్తవాలు రాస్తున్నారని ఆవేదన చెందారు. అక్కడితో ఆగకుండా తనపై ద్వేషం కలిగేలా ట్రోల్స్, విమర్శలు చేస్తున్నారన్నారు. ఈ విషయం తనను ఎంతగానో బాధిస్తోందని భావోద్వేగానికి గురయ్యారు. తాను ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు పడుతున్నానని పేర్కొన్నారు.

Dhanashree
Dhanashree

 

అయితే తాను మౌనంగా ఉంటున్నానంటే దానికి అర్థం బలహీనంగా ఉన్నట్లు కాదని అన్నారు. తాను వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని విలువలతో ముందుకు సాగాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఎప్పటికైనా నిజం విజయం సాధిస్తుందని.. దాన్ని సమర్థించుకోవాల్సిన అవసరం లేదన్నారు. దీంతో ఆమె పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. 

ఇది కూడా చూడండి: ప్రభుత్వ వైఫల్యమే తొక్కిసలాటకు దారితీసింది: భూమన కరుణాకర్‌రెడ్డి

ఒకరినొకరు అన్‌ఫాలో

ఇటీవల వీరి విడాకులకు సంబంధించిన మరిన్ని వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. అదే సమయంలో అన్‌ఫాలో అనంతరం చాహల్ తన అకౌంట్‌లో ధనశ్రీతో ఉన్న అన్ని ఫొటోలను తొలగించాడు. దీంతో ఈ జంట విడాకులు నిజమేనని నెటిజన్లు ఒక అంచనాకు వచ్చేశారు. 

2023లో మొదలు

ఇది కూడా చూడండి: తొక్కిసలాటకు కారణం అదే.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

వీరి విడాకులకు సంబంధించి వార్తలు రావడం ఇది తొలిసారి కాదు. గతంలో 2023లో ధనశ్రీ తన భర్త చాహల్‌ను అన్‌ఫాలో చేసినప్పుడు కూడా ఇలానే వార్తలు వైరల్ అయ్యాయి. చాహల్ - ధనశ్రీ జంట విడాకులకు సంబంధించి రూమర్స్ రావడం అదే తొలిసారి. ఇక ఇప్పుడు మళ్లీ వీరి విడాకుల వార్తలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ విడిపోవడానికి ఈ జంట సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఈ జంట నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

#latest-telugu-news #dhanasri #yuzvendra-chahal #team-india
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

DC VS MI: ఢిల్లీకి బ్రేక్ పడింది..ఉత్కంఠ మ్యాచ్ లో...

DC VS MI: ఢిల్లీకి బ్రేక్ పడింది..ఉత్కంఠ మ్యాచ్ లో గెలిచిన ముంబయ్

ఐపీఎల్ లో అంతా తారుమారు అవుతోంది. వరుసగా మ్యాచ్ లు గెలుస్తున్న టీమ్ లు అనూహ్యంగా ఓడిపోతున్నాయి. పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న జట్లు మ్యాచ్ లు గెలుస్తున్నాయి. ఈరోజు  ఢిల్లీతో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబయ్ విజయం సాధించింది. 

New Update
ipl

DC VS MI

ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. సూపర్ మ్యాచ్ లో ముంబయ్ విజయం సాధించింది. ఈరోజు ఐపీఎల్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయ్ ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఎమ్ఐ 12 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబయ్ 206 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీకి ఇచ్చింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన డీసీ బ్యాటింగ్‌కు దిగిన  19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఢిల్లీ బ్యాటర్ కరుణ్‌ నాయర్‌  40 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో 89 పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో కర్ణ్‌ శర్మ 3, దీపక్‌ చాహర్‌ 1, బుమ్రా 1, శాంట్నర్‌ 1 వికెట్లు తీశారు. ముంబయ్ కు ఇది రెండో విజయం.

భారీ స్కోర్ ఇచ్చిన ముంబయ్..

అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన ముంబయ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులో 59 పరుగులు చేశాడు. రికెల్టన్ 41, సూర్యకుమార్ 40, నమన్ 38 పరుగులతో రాణించారు. విప్రజ్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు తీశారు. మకేశ్ ఓ వికెట్ తీశారు. చివరి ఓవర్లో 11 రన్స్ చేశారు ముంబయ్ బ్యాటర్లు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(18) మరోసారి నిరాశపరిచాడు. ఐదో ఓవర్లో విప్రజ్‌ వేసిన చివరి బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. చివర్లో నమన్ దూకుడుగా ఆడి ముంబయ్ ఎక్కువ స్కోరు వచ్చలా చేశాడు. ఢిల్లీ  బౌలర్లలో విప్రజ్‌, కుల్దీప్‌ రెండేసి వికెట్లు.. ముకేశ్‌ ఒక వికెట్‌ తీశారు.    

today-latest-news-in-telugu | IPL 2025 | dc | delhi | mumbai-indians

Also Read: DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్

Advertisment
Advertisment
Advertisment