Smriti Mandhana: భారత స్టార్ పేసర్ బుమ్రా(Jasprit Bumrah)కు తాజాగా అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు బుమ్రాకు వరించింది. 2024 ఏడాదికి గానూ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు బుమ్రా సెలెక్ట్ అయ్యాడు. అయితే అతడితో పాటు భారత మహిళల క్రికెట్ జట్టులో స్టార్ బ్యాటర్ కు(ICC Women's ODI Cricketer) కూడా ఈ ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు(ICC Award) వరించింది.
ఆ స్టార్ బ్యాటర్ మరెవరో కాదు స్మృతి మంధాన. ఆమె క్రీజ్ లోకి దిగిందంటే.. ప్రత్యర్థి బౌలర్లు గజగజ వణకాల్సిందే. తన బ్యాట్ తో బాదుడే బాదుడు అన్నట్లుగా స్మృతి మంధాన ఆడుతుంది. ఎన్నో మ్యాచ్ లను గెలిపించి సత్తా చాటింది. చాలా ఈజీగా హాఫ్ సెంచరీ, సెంచరీలు సాధిస్తుంది. అలాంటి బ్యాటర్ కు తాజాగా అరుదైన గౌరవం దక్కింది.
ఇది కూడా చూడండి: Kerala: ఆ మ్యాన్ ఈటర్ కనిపిస్తే చంపేయండి..ప్రభుత్వం ఆదేశాలు!
BCCI POSTER FOR SMRITI MANDANA
— Digital Hunt 247 (@digitalhunt247) January 27, 2025
ICC WOMEN'S ODI CRICKETER OF THE YEAR. 🇮🇳 pic.twitter.com/g53xnbocsY
స్మృతి మంధానకు అరుదైన గౌరవం
2024 ఏడాదికి గానూ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును స్మృతి మంధాన గెలుచుకుంది. ఈ అవార్డు కోసం చమరి ఆటపట్టు (శ్రీలంక), లారా వోల్వార్డ్ట్ (దక్షిణాఫ్రికా), అన్నాబెల్ సదర్లాండ్ (ఆస్ట్రేలియా) పోటీపడగా.. వారిని వెనక్కి నెట్టి ఈ అవార్డును సొంతం చేసుకుంది. అంతేకాకుండా ‘ఉమెన్స్ టీ20 ఆల్‌స్టార్ ఎలెవన్ టీమ్’కు కూడా ఆమె సెలెక్ట్ అయింది. కాగా ఈ 28 ఏళ్ల స్టార్ బ్యాటర్ మంధాన ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకోవడం ఇది రెండవసారి కావడం గమనార్హం.
ఇది కూడా చూడండి: Donald Trump: ఇజ్రాయెల్ కి మళ్లీ బాంబులు..బైడెన్ విధించిన నిషేధాన్ని ఎత్తేసిన కొత్త అధ్యక్షుడు!
SMRITI MANDHANA - ICC WOMEN'S ODI CRICKETER OF THE YEAR. 🇮🇳 pic.twitter.com/CID0LawNCM
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 27, 2025
ఇది కూడా చూడండి: UCC: ఉత్తరాఖండ్ లో ఉమ్మడి పౌరస్మృతి..ఎప్పటి నుంచి అమలు అంటే
కాగా మంధాన 2024 వన్డేల్లో అద్భుతమైన ఆటతీరు కనబర్చింది. గతేడాది జూన్‌లో దక్షిణాఫ్రికాపై జరిగిన మూడు వన్డేల సిరీస్ లో అదరగొట్టేసింది. 3-0 తేడాతో ఈ సిరీస్ ను గెలుచుకోవడంలో మంధాన కీలక పాత్ర వహించింది. ఇక 2024లో మొత్తం 13 ఇన్నింగ్స్‌ల్లో 747 పరుగులు చేసిన నెంబర్ వన్ బ్యాటర్ గా నిలిచింది. గతేడాది వన్డేల్లో మంధాన యావరేజ్ 57.86 కాగా.. ఆమె స్ట్రైక్ రేట్ 95.15గా ఉంది.