Rohit Sharma: రోహిత్ శర్మ ఫామ్‌పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు.. పెద్ద సమస్యే అంటూ!

రోహిత్ శర్మ ఫామ్‌పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఫామ్‌లో లేని రోహిత్ ఛాంపియన్స్ ట్రోఫి నాటికి సిద్ధమైతే బాగుంటుందని అన్నారు. ఎప్పుడైతే కెప్టెన్ ఫామ్ కోల్పోతాడో.. అప్పుడు అతడి ప్రభావం జట్టుపై పడుతుందని, అది పెద్ద సమస్య అని చెప్పుకొచ్చారు.

New Update
kapil dev blunt message to captain rohit sharma ahead of champions trophy

kapil dev blunt message to captain rohit sharma ahead of champions trophy 2025

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లో లేకపోవడంపై దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ గత పది ఇన్నింగ్స్‌లలో ( అన్ని ఫార్మాట్లు కలిపి) ఒక్కసారి కూడా 50 పరుగులు చేయలేదన్నారు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లోనూ కేవలం 2 పరుగులకే ఔటయ్యాడని అన్నారు. చివరిగా గతేడాది అక్టోబర్‌లో 50+ మార్క్‌ను సాధించాడని గుర్తు చేశారు. 

Also Read: ముఖ్యమంత్రి చంద్రబాబు- నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ మధ్య ఆసక్తికర చర్చ ..

టీమిండియాకు శుభాకాంక్షలు

ఈ మేరకు ఆయన ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బరిలోకి దిగుతున్న టీమిండియా జట్టుకు శుభాకాంక్షలు చెప్తూ రోహిత్ ఫామ్‌పై మాట్లాడారు. రోహిత్ శర్మ ఒక స్టార్ ప్లేయర్ అని అన్నారు. అందువల్ల అతడు త్వరగానే ఫామ్‌లోకి వస్తాడని ఆయన ఆశిస్తున్నట్లు తెలిపారు. అయితే అతడు ఛాంపియన్స్ ట్రోఫీ నాటికి సిద్ధమైపోతే మరింత బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. 

Also Read: సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలపై బిగ్ అప్డేట్.. ఫిబ్రవరి 15 లోగా పూర్తి చేయాలని ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు

దేశవ్యాప్తంగా టీమిండియా జట్టు ఆట ప్రదర్శన చూసేందుకు ఎంతో తహతహలాడుతోందని ఆయన అన్నారు. ఇటీవల కాలంలో భారత్ జట్టు అద్భుతంగా ఆడుతోందని.. కానీ కొన్ని సార్లు మాత్రం తడబడినట్లు కనిస్తోందని పేర్కొన్నారు. 

Also Read: విజయసాయికి కేతిరెడ్డి కౌంటర్.. ఆ విషయం అందరికీ తెలుసంటూ సంచలన ట్వీట్!

అతడి ప్రభావం జట్టుపై

ఇక ఎప్పుడైతే కెప్టెన్ ఫామ్ కోల్పోతాడో.. అప్పుడు అతడి ప్రభావం జట్టుపై పడుతుందని చెప్పుకొచ్చారు. అప్పుడే అసలు సమస్యలు మొదలవుతాయని.. జట్టు సరిగ్గా పెర్ఫార్మెన్స్ చేయకపోతే అభిమానులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారని తెలిపారు. ఇక టీ20 ప్రపంచకప్‌ను గెలిచాక బ్రహ్మరథం పట్టారని.. అలాంటి సీన్‌ను తన జీవితంలో అప్పటి వరకు చూడలేదన్నారు. అందువల్ల ప్లేయర్లపై ఎక్కువగా ప్రశంసలు కురిపించకూడదని.. అలా చేస్తే తర్వాత పరిణామాలు తట్టుకోవడం ఎవరి అంచనాలకు అందవని ఆయన చెప్పుకొచ్చారు .

Also Read: పాక్‌ ముష్కరుల చొరబాటు భగ్నం.. ఏడుగురిని మట్టుబెట్టిన భారత సైన్యం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు