Cricketer Divorce: విడాకులకు సిద్ధమైన మరో టీమిండియా క్రికెటర్

టీమిండియా క్రికెటర్ మనీష్ పాండే, అతని భార్య అశ్రిత శెట్టి కూడా విడాకులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత విషయాల వల్ల ఇద్దరు విడిపోతున్నట్లు సమాచారం. ఇద్దరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో పాటు ఇద్దరు ఉన్న ఫొటోలు డిలీట్ చేశారు.

New Update
Manish pandey-Ashrita shetty

Manish pandey-Ashrita shetty Photograph: (Manish pandey-Ashrita shetty)

టీమిండియా (Team India) క్రికెటర్ యుజువేంద్ర చాహల్, ధన్‌శ్రీ వర్మ విడాకులు (Divorce) తీసుకుంటున్నారని ఈ మధ్య కాలంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరిని ఒకరు అన్‌ ఫాలో చేసుకోవడం, కలిసి ఉన్న ఫొటోలు డిలీట్ చేయడంతో విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. అయితే మరో టీమిండియా క్రికెటర్ కూడా విడాకులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి:  Horoscope: ఈ రాశి వారికి అన్నింటా విజయమే.. కానీ ఒక్క విషయంలో మాత్రం..

ఫొటోలు డిలీట్ చేయడం..

స్టార్ జోడి అయిన మనీష్ పాండే (Manish Pandey), అతని భార్య అశ్రిత శెట్టి (Ashrita Shetty) కూడా విడాకులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత విషయాల వల్ల ఇద్దరి మధ్య గొడవలు వచ్చినట్లు సమాచారం. వీరిద్దరు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. అలాగే ఇద్దరు ఉన్న ఫొటోలను వారి ఖాతా నుంచి డిలీట్ చేశారు. దీంతో ఇద్దరూ విడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విడాకులపై మనీష్ పాండే, అశ్రిత శెట్టి ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ జంట స్పందిస్తేనే దీనిపై క్లారిటీ వస్తుంది. 

ఇది కూడా చూడండి:  Vykunta Ekadasi 2025: ముక్కోటి ఏకాదశి నాడు ఇలా పూజిస్తే పుణ్యమంతా మీకే

మనీష్ పాండే, అశ్రిత శెట్టి 2019 లో పెళ్లి చేసుకున్నారు. తమిళ సినిమాల్లో నటించిన అశ్రిత ఐపీఎల్ మ్యాచ్‌ల్లో మైదానంలో కనిపించేది. అయితే ఐపీఎల్ 2024 నుంచి స్టేడియంలో కనిపించలేదు. ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌లో మనీష్ పాండే ఉన్నాడు. ఈ జట్టు గతేడాది టైటిల్ కూడా గెలుచుకుంది. ఈ సమయంలో కూడా అశ్రిత ఎలాంటి పోస్ట్ సోషల్ మీడియాలో చేయలేదు. 

ఇది కూడా చూడండి: Putrada Ekadashi 2025: పౌష పుత్రద ఏకాదశి రోజు .. ఈ 5 రాశుల వారి జీవితంలో అనుకోని సంఘటనలు !

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

GT VS SRH: హైదరాబాద్ ఇక ఇంటికి వెళ్ళిపోయినట్లే...వరుసగా నాలుగో ఓటమి

హైదరాబాద్  సన్ రైజర్స్ ఇంక ఇంటికి వెళ్ళిపోయినట్లే. ఈరోజు కూడా గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయి వరుసగా నాలుసార్లు ఓటమిని చవి చూసింది. ఏడు వికెట్ల తేడాతో హైదరాబాద్ మ్యాచ్ ను పోగొట్టుకుంది. 

New Update
ipl

GT VS SRH

సొంత గ్రౌండ్ లో హైదరాబాద్ మళ్ళీ ఓడిపోయింది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. హైదరాబాద్ ఇచ్చిన 153 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 16.4 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది.  గుజరాత్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ 61 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 49 పరుగులతో రాణించారు. హైదరాబాద్ బౌలర్స్ లో షమీ 2, రమిన్స్ ఒక వికెట్ తీశారు.  

గుజరాత్ బౌలర్లు తాట తీశారు..

అంతకు ముందు ఉప్పల్ స్డేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్‌రైజర్స్ ను గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ దారుణంగా దెబ్బకొట్టాడు. నాలుగు ఓవర్లలో  కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన నాలుగు వికెట్లు తీశాడు.  ట్రావిస్ హెడ్ (8), అభిషేక్ శర్మ (18) లను మొదట్లోనే  వెనక్కి పంపిన సిరాజ్.. డేంజరెస్ ఆటగాడు అనికెత్ వర్మ(18) ను ఎల్బీగా వెనక్కి పంపించాడు. సన్‌రైజర్స్ ఆటగాళ్లలో నితీష్ కుమార్ రెడ్డి(31), హెన్రిచ్ క్లాసెన్(27), పాట్ కమ్మిన్స్ (22) పరుగులు చేశారు.  గుజరాత్ బౌలర్ లో మహమ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీయగా.. ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిషోర్ చెరో రెండు వికెట్లు తీశారు.  

today-latest-news-in-telugu | IPL 2025 | gt-vs-srh 

Also Read: Jibli Trend: జిబ్లీలో ఫోటోలు అప్ లోడ్ చేస్తున్నారా..అయితే జాగ్రత్త

Advertisment
Advertisment
Advertisment