/rtv/media/media_files/2025/03/24/nxFMiyBAGrj7xHTq77gV.jpg)
Tamim Iqbal
Tamim Iqbal: బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ గుండెపోటుకు గురయ్యారు. ఢాకా ప్రీమియర్ లీగ్‌లో భాగంగా అతడు సోమవారం మ్యాచ్ ఆడుతున్నారు. ఈ క్రమంలోనే అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. దీంతో తమీమ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈసీజీ, తదితర స్కానింగ్స్ చేయించారు. అయితే తమిమ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం అతనికి వెంటలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
Also Read: Contaminated Food: ప్రాణాలు తీస్తున్న కలుషిత ఆహారం.. అందుకే వండిన వెంటనే తినేయాలి
🚨 Cricket Shocker!
— Cricketik 24×7 (@cricketik247) March 24, 2025
Tamim Iqbal suffers a heart attack during a Dhaka Premier League match today. Wishing him a speedy recovery! 🙏#TamimIqbal #DPL pic.twitter.com/p6YHPu5Du8
bangladesh | telugu-news | rtv | heart-attack | tamim-iqbal
తమిమ్‌కు ఇప్పటికే రెండుసార్లు గుండెపోటు వచ్చినట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) చీఫ్ మెడికల్ అధికారి దేబాశిస్ చౌదరి అన్నారు. అతనికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నప్పటికీ పరిస్థితి సీరియస్‌గా ఉందని తెలిపారు. అయితే తమిమ్‌ను మొదటగా ఢాకాలోని ఎవర్‌కేర్ ఆస్పత్రికి హెలికాప్టర్ ద్వారా తరలించాలని ప్రయత్నాలు జరిగాయి. కానీ అతని ఆరోగ్య పరిస్థితి వల్ల స్థానిక ఆస్పత్రికే తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read: వారేవా.. చెన్నైని వణికించిన ఆటో డ్రైవర్ కొడుకు..
ఇదిలాఉండగా తమిమ్ ఇక్బాల్ బంగ్లాదేశ్‌లో క్రికెట్ టీమ్‌లో అత్యంత కీలకమైన ఆటగాడు. అతను 70 టెస్టులు, 243 వన్డేలు, 78 టీ20 మ్యాచుల్లో ఆడాడు. అన్ని ఫార్మట్లలో కలిపి 15 వేల కన్నా ఎక్కువగా పరుగులు చేశాడు. తమిమ్‌కు గుండెపోటు రావడంతో క్రికెట్ అభిమానులు షాకైపోయారు. అతను త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Also Read: IPLలో ఆంధ్రా రొయ్యల వ్యాపారి కొడుకు.. ఎవరీ సత్యనారాయణరాజు?