WFI Suspension: రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాపై సస్పెన్షన్‌ ఎత్తివేత

కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. 2023 డిసెంబర్‌ 24న WFIపై సస్పెన్షన్ వేటు వేసింది. WFI కార్యవర్గం తీసుకున్న నిర్ణయం నచ్చకపోవడంతో కేంద్రం వేటు వేసింది.

New Update
WFI suspension

WFI suspension Photograph: (WFI suspension)

కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. 2023 డిసెంబర్‌ 24న WFIపై కేంద్ర కీడా శాఖ సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో దేశీయ టోర్నమెంట్ల నిర్వహణకు, అంతర్జాతీయ టోర్నమెంట్లకు జాతీయ జట్ల ఎంపికకు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు లైన్ క్లియర్ అయ్యింది. WFIకి జరిగిన ఎన్నికల్లో సంజయ్ సింగ్ నేతృత్వంలోని ప్యానెల్ 2023 డిసెంబర్ 21న విజయం సాధించిన విషయం తెలిసిందే.

Also read: china heart attack vaccine: చైనా సైంటిస్టుల అద్భుతం.. గుండెపోటు, స్ట్రోక్స్ రాకుండా వ్యాక్సిన్!

2023లో సంజయ్‌ సింగ్‌ డబ్ల్యూఎఫ్‌ఐ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైయ్యాడు. అండర్‌-15, అండర్‌-20 జాతీయ పోటీలను ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి నచ్చలేదు. రెజ్లర్లు పోటీలకు సిద్ధమయ్యేందుకు సమయం ఇవ్వకుండా ఈవెంట్ డేట్ ప్రకటించడంపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకి  ఆగ్రహం తెప్పించింది. దీంతో కొత్త కార్యవర్గంపై వేటు వేసింది.

Also read: SLBC టన్నెల్‌ రెస్క్యూ ఆపరేషన్‌లో మద్రాస్ IIT రోబోలు

క్రీడా శాఖ విధివిధానాలను అమలు చేయలేదనే కారణంతో తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు సస్పెన్షన్‌ అమల్లో ఉంటుందని 2023, డిసెంబర్‌ 24న క్రీడా శాఖ వెల్లడించింది. అయితే, ప్రస్తుతం దిద్దిబాటు చర్యలు తీసుకున్న కారణంగా డబ్ల్యూఎఫ్‌ఐపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని నిర్ణయించినట్లు క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: గౌతమ్ గంభీర్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు

టీమిండియా హెడ్ కోచ్, మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు హత్య బెదిరింపులు వచ్చాయి. ఐసిస్ కశ్మీర్ నుంచి వచ్చినట్లు గౌతమ్ గంభీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే తనకు, తన కుటుంబానికి భద్రత కల్పించాలని కోరారు. 

New Update
Gautam Gambhir comments on Sydney Test defeat

Gautam Gambhir

టీమిండియా హెడ్ కోచ్, మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు హత్య బెదిరింపులు వచ్చాయి. ఐసిస్ కశ్మీర్ నుంచి వచ్చినట్లు గౌతమ్ గంభీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే తనకు, తన కుటుంబానికి భద్రత కల్పించాలని కోరారు. ఐ కిల్‌ యూ అంటూ రెండు ఈ-మెయిల్స్‌ వచ్చినట్లు సెంట్రల్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు గంభీర్ ఫిర్యాదు చేశాడు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు పంపారనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే పహల్గాం ఉగ్రదాడిపై గౌతమ్ గంభీర్ స్పందించారు. ఈ క్రమంలోనే బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది.

 

Advertisment
Advertisment
Advertisment