SRH vs RR : పోరాడి ఓడిన రాజస్థాన్.. సన్రైజర్స్ గ్రాండ్ విక్టరీ!

రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్44 పరుగుల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. టార్గె్‌ట్ లో రాజస్థాన్ జట్టు 6 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. 

New Update
srh won

ఉప్పల్ స్డేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్44 పరుగుల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. టార్గె్‌ట్ లో రాజస్థాన్ జట్టు   6 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది.  సంజుశాంసన్‌ 66, ధ్రువ్‌ జురేల్‌ 70, హిట్‌మేయర్‌ 42, శుభమ్‌ దూబే 34 నాటౌట్‌ రాణించారు.  యశస్వి జైస్వాల్‌ 1, కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ 4, నితీశ్‌ రాణా 11 విఫలమయ్యారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్లలో  సిమర్‌జీత్‌ సింగ్‌ 2, హర్షల్‌పటేల్‌ 2, మహమ్మద్‌ షమీ, ఆడమ్‌ జంపా తలో వికెట్‌ తీశారు.   

Also Read :  థంబ్‌నెయిల్ కోసం నా భర్తను చంపేశారు!.. నటి భార్గవి ఫైర్

Also Read :  అమెరికాలో తాగుబోతు బీభత్సం.. భారతీయ తండ్రీకూతుళ్లను కాల్చి చంపాడు

ఇషాన్ కిషన్ వీరవిహారం

ముందుగా టాస్  ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (679 ఫోర్లు, 3 సిక్స్‌)లతో విధ్వంసం సృష్టించగా..  ఇషాన్ కిషన్ (106*11 ఫోర్లు, 6 సిక్స్‌లు) వీరవిహారం చేశాడు.హెన్రిచ్ క్లాసెన్ (34), నితీశ్‌ కుమార్ రెడ్డి (30), అభిషేక్ శర్మ (24) కూడా క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. రాజస్థాన్ రాయల్స్ తరఫున తుషార్ దేశ్‌పాండే మూడు వికెట్లు తీయగా, మహీష్ తీక్షణ రెండు వికెట్లు పడగొట్టాడు.

Also Read :  ఆస్పత్రికి అల్లు అర్జున్... టెన్షన్ లో అల్లు ఫ్యామిలీ

Also Read :  నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్!

 

ipl-2024 | srh-vs-rr | telugu-sports-news | telugu-cricket-news | latest-telugu-news | today-news-in-telugu

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PBKS : ప్రీతి జింటాకు బ్యాడ్ న్యూస్... రూ. 2కోట్ల బౌలర్ ఔట్!

ఐపీఎల్ 2025లో మంచి ఊపు మీదున్న పంజాబ్ కింగ్స్ జట్టుకు ఊహించని దెబ్బ తగిలింది.  ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్‌లకు దాదాపుగా దూరమయ్యాడని ఆ జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ వెల్లడించారు.

New Update
Lockie Ferguson

Lockie Ferguson

ఐపీఎల్ 2025లో మంచి ఊపు మీదున్న పంజాబ్ కింగ్స్ జట్టుకు ఊహించని దెబ్బ తగిలింది.  ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్‌లకు దాదాపుగా దూరమయ్యాడని ఆ జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ వెల్లడించారు. శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్‌లో ఫెర్గూసన్ కేవలం రెండు బంతులు మాత్రమే వేసి మైదానం నుంచి వైదొలిగాడు. అతను ఎడమ కాలును తుంటి క్రింద గాయం కావడంతో బాధపడుతున్నాడని  జేమ్స్ హోప్స్ వెల్లడించాడు.

తొడ కండరాల గాయం కారణంగా

బ్యాటింగ్ లో అదరగొడుతున్న పంజాబ్ జట్టు.. . బౌలింగ్ లో కాస్త బలహీనంగా ఉంది. ఇలాంటి టైమ్ లో పంజాబ్ కింగ్స్  ఫెర్గూసన్ ను కోల్పోవడం ఆ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ అనే చెప్పాలి.  తొడ కండరాల గాయం కారణంగా ఫిబ్రవరిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీకి  న్యూజిలాండ్ పేసర్ ఫెర్గూసన్  దూరమయ్యాడు. 2024 నవంబర్ తర్వాత ఫెర్గూసన్ గాయపడటం ఇది మూడోసారి.

కాగా ఈ ఐపీఎల్ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో, ఫెర్గూసన్ 9.17 ఎకానమీ రేటుతో ఐదు వికెట్లు పడగొట్టాడు. గత ఏడాది జరిగిన IPL 2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ లాకీ ఫెర్గూసన్‌ను రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. IPL 2024లో, ఫెర్గూసన్ ఆర్సీబీ తరపున ఆడాడు. పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం ఆరు పాయింట్లతో 6వ స్థానంలో ఉంది.  ఏప్రిల్ 15న పంజాబ్ కింగ్స్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది.  
 

Advertisment
Advertisment
Advertisment